Israel Hamas Conflict: సాంకేతికపరంగా, ఆర్మీ పరంగా ఇజ్రాయిల్ చాలా అభివృద్ధి చెందిన దేశం. చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ తనను తాను రక్షించుకుంటున్నది. ఐరన్ డ్రోమ్, ఇనుప కంచె, రిజర్వ్ సైన్యం వంటి అనేక రక్షణ వ్యవస్థలతో అలారారుతోంది. అయితే అలాంటి దేశం ఇప్పుడు ఎందుకు హమాస్ తీవ్రవాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది? ఎన్నో దేశాలకు సాంకేతికంగా సహాయం చేసిన ఇజ్రాయిల్ ఎందుకు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతోంది? వాస్తవానికి ఇజ్రాయిల్ మీద దాడి ఒక రోజులో జరిగింది కాదు. ఆ దేశం మీద దాడి జరిపేందుకు ఏడాది క్రితమే పథక రచన జరిగింది. ఈ దాడికి సూత్రధారులు రష్యా, ఇరాన్, టర్కీ. ఈ దేశాలలో హమాస్ తీవ్రవాదులు శిక్షణ పొందారు.. ఈ శిక్షణ కోసం 20 నుంచి 25 సంవత్సరాల యువకులను ఎంపిక చేశారు.
రష్యా స్పెట్సానాజ్
ఇది రష్యన్ స్పెషల్ ఫోర్స్ పేరు. కౌంటర్ ఇన్సర్జెన్సీ, పవర్ ప్రొటెక్షన్ మిషన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. రష్యన్ లైట్ ఇంఫాన్ట్రీ ఫోర్సెస్ డివిజన్లో భాగంగా ఈ స్పెట్సానాజ్ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు లైట్ ఇన్ ఫాన్ట్రీ ముందుకు వెళుతుంటే దాని వెనుకగా
స్పెట్సానాజ్ కమాండోలు ఉంటారు. ఒకవేళ శత్రు సైనిక బంకర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పుడు స్పెట్సానాజ్ కమాండోలకు మిషన్ అప్ప చెబుతారు. స్పెట్సానాజ్ కమాండోలు ముందుకు వెళ్లి ఒక్కసారిగా బంకర్ల మీద దాడి చేసి అందులో ఉన్న వాళ్లను చంపేస్తారు.. వీళ్ళు ఫెన్సింగ్ కట్టర్లతోపాటు హ్యాండ్ గ్రనెడ్స్, రివాల్వర్, మిలటరీ గ్రేడ్ డాగర్ ను వాడతారు. ముఖ్యంగా పక్క బంకర్లలో ఉండే వాళ్ళకి తెలియకుండా పని కాని చేస్తారు. స్పెట్సానాజ్ ద్వారా 200 మంది హమాస్ తీవ్రవాదులకు రష్యా శిక్షణ ఇప్పించింది. ఏడాదిలో మూడు బ్యాచ్ లకు శిక్షణ ఇచ్చింది. అయితే ఇరాన్లోనే ఇదంతా జరిగింది. స్పెట్సానాజ్ దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళే దక్షిణ ఇజ్రాయిల్ లో ఉన్న ఐడీఎఫ్ చెక్ పోస్టుల మీద దాడి చేసి సరిహద్దు పట్టణాల్లోకి ప్రవేశించారు.
ఇరాన్
సముద్రంపై, సముద్రం నీటి అడుగున ఎలా వేగంగా, నిశ్శబ్దంగా ప్రయాణించాలో శిక్షణ ఇచ్చింది. చిన్న చిన్న స్పీడ్ బోట్లతో శత్రువు మీద దాడి చేసే సామర్థ్యం ఇరాన్ దేశానికి ఉంది. గత దశాబ్ద కాలంగా అమెరికా విమాన వాహక నౌకలని చిన్నచిన్న స్పీడ్ బోట్లతో ఆర్ డీ ఎక్స్ ని నింపి ఎలా ధ్వంసం చేయొచ్చో అనేక ప్రయోగాల కోసం నమూనా విమాన వాహక నవకల మీద దాడి చేసి వాటి ఫలితాలను విశ్లేషిస్తూ వస్తోంది. అలాగే స్కూబా డ్రైవింగ్ సూట్లను ధరించి సముద్రం లోపల మూడు నాటికల్ మైళ్ళు ఎలా ఈదాలో హమాస్ ఉగ్రవాదులకు ఏకే 47 లు మోసుకుంటూ ఈదగలిగే విధంగా శిక్షణ ఇచ్చింది.
టర్కీ
పారా గ్లైడింగ్ లో శిక్షణకు టర్కీ చాలా ప్రసిద్ధి పొందింది. వందమంది హమాస్ ఉగ్రవాదులు టూరిస్ట్ వీసా తో టర్కీ కి వచ్చి పారా గ్లైడింగ్ లో శిక్షణ పొందారు. కేవలం గాలి ఆధారంగానే కాకుండా వెనుక ప్రొపెల్లర్ తో ముందుకు నెట్టే గ్లైడర్స్ ను వాడారు. గాల్లో ఉండగానే కింద ఎవరన్నా ఐడీఎఫ్ సైనికులు ఉంటే కింద టార్గెట్ ని షూట్ చేయడం కూడా ప్రాక్టీస్ చేశారు. ఇలా ఈ మూడు దేశాలు శిక్షణ ఇవ్వడం వల్లే అంతటి శత్రు దుర్భేద్యమైన ఇజ్రాయిల్ ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల వల్ల చాలా ఇబ్బంది పడుతోంది. ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని చవిచూస్తోంది.