Virat Kohli: సోమవారం ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తనలో ఉన్న అసలు కోణాన్ని అభిమానులకు రుచి చూపించాడు. దీంతో అతడి అభిమానులు సోషల్ మీడియాలో నవ్వులు చిందిస్తున్నారు. వామ్మో విరాట్ కోహ్లీ ఇంతటి చిలిపా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.. ముంబై జట్టుపై మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఉత్కంఠ మధ్య విజయం సాధించిన తర్వాత ఒకరినొకరు అభినందించుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ పరస్పరం ఆ లింగనం చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా పరస్పరం అభినందించుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం కలిగించాయి. ఇప్పటికీ అవి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటికి మిలియన్ల కొద్ది వ్యూస్ లభిస్తుతున్నాయి. ఇప్పటికి ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి.
Also Read: అన్నదమ్ముల వీరోచిత పోరాటం.. అంతిమంగా పెద్దోడిదే పై చేయి!
విరాట్ ఏం చేశాడంటే
సహజంగానే విరాట్ కోహ్లీ తనలో ఉన్న చిలిపితనాన్ని ప్రదర్శిస్తుంటాడు. తోటి ఆటగాళ్లతో తన ఆనందాన్ని పంచుకుంటాడు. రోహిత్ నుంచి మొదలుపెడితే బుమ్రా వరకు అందర్నీ ఇమిటేట్ చేస్తుంటాడు. సీరియస్ వాతావరణం కాస్త సరదాగా మార్చేస్తాడు. ఇక అతడు చేసే వ్యాఖ్యలు కూడా జట్టులో నవ్వులు పూయిస్తాయి. డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణాన్ని తేలికచేస్తాయి. చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ చిలిపితనంతో ఉండేవాడు. అందువల్లే తన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పటికీ అతడు ఆనందంగా ఉంచాలని ప్రయత్నిస్తుంటాడు. తను ఎంత గొప్ప ఆటగాడు అయినప్పటికీ.. డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తడానికి కూడా మొహమాటం చూపించడు. అంతేకాదు తోటి ఆటగాళ్లతో ఎటువంటి భేష జాన్ని ప్రదర్శించడు. మైదానంలో అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై సింహంలాగా దూసుకెళ్తుంటాడు. ఆ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడు. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పునరుద్గాటిస్తాడు. అందువల్లే విరాట్ కోహ్లీ అంటే అభిమానులు విపరీతమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు. ఇక సోమవారం ముంబై జట్టుతో గెలిచిన తర్వాత ఒక్కొక్కరుగా బెంగళూరు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి వస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ కు వస్తుండగా అతడికి ఒక బెలూన్ కనిపించింది. బెంగళూరు జట్టు గెలిచిన తర్వాత వారు వేసుకున్న జెర్సీ రంగులో ఉన్న బెలూన్లను ముంబై మైదానంలో వదిలారు. అయితే ఒక బెలూన్ ఎగరకుండా అక్కడే ఉండిపోయింది. దీంతో ఆ బెలూన్ ను పట్టుకొని సరదాగా ఆడుకుంటూ.. విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. ఈ వీడియోను బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ చేస్తున్నారు. ” చూశారా అండి.. విరాట్ కోహ్లీ లో ఉన్న మరో కోణం.. అందువల్లే అతడు మాకు నచ్చాడు. అతడిని ఆరాధించేలా చేస్తాడు.. మైదానంలో వీరోచితంగా ఆడిన ఆటగాడు.. చివరికి బెలూన్ ను కూడా వదిలిపెట్టడం లేదని” సోషల్ మీడియాలో బెంగళూరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: వన్ డౌన్ లో వచ్చి.. సెంచరీలు కొట్టిన తిలక్ ను 4వ స్థానంలోనా?
Virat Kohli playing with the baloon at Wankhede [Vinesh Prabhu] pic.twitter.com/2mskrW5MBZ
— Johns. (@CricCrazyJohns) April 8, 2025