IND vs AUS – Virat Kohli : వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో ఇండియా మొదటి మ్యాచ్ ని ఆడుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. అదేంటంటే ఐసీసీ నిర్వహించే వైట్ బాల్ టోర్నమెంట్ లో ఇండియా తరఫున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకుముందు సచిన్ టెండుల్కర్ 58 ఇన్నింగ్స్ లలో 2719 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసి ఉండగా విరాట్ కోహ్లీ మాత్రం 64 ఇన్నింగ్స్ లలో 2730 కి పైన రన్స్ చేస్తు ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి ముందుకు సాగుతున్నాడు…
రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్స్ లో 2462 పరుగులు చేసి ఈ రికార్డును బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఇండియా తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లకి 199 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియన్ టీంలో స్టీవ్ స్మిత్ 46 పరుగులు చేయగా,వార్నర్ 41 రన్స్ చేశారు,అలాగే చివర్లో స్టార్క్ 28 పరుగులు చేశాడు. ఇక వీళ్ళని మినహాయిస్తే ఆస్ట్రేలియా టీం లో ఏ ప్లేయర్ కూడా భారీ పరుగులు చేయలేకపోయాడు. దాంతో ఆస్ట్రేలియా టీం 199రన్స్ కే అలౌట్ అవ్వడం జరిగింది. ఇక ఈ విషయంలో ఇండియన్ బౌలర్లను చాలా వరకు మెచ్చుకోవచ్చు.ఎందుకంటే వరల్డ్ లోనే టాప్ టీం గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా టీమ్ ని 200 పరుగులు కూడా చేయకుండా కట్టడి చేసి మన ఇండియన్ బౌలర్లు చాలా వరకు సక్సెస్ అయ్యారు.
ఇక మన బౌలర్ లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు,కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు, సిరాజ్ ,హార్దిక్ పాండ్యా, అశ్విన్ ముగ్గురు తలో వికెట్ తీశారు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ 200 పరుగుల మార్క్ కూడా దాటకుండా 199 పరుగులకు అలౌట్ అవ్వడం జరిగింది. ఇక 200 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీంకి మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది.ఇద్దరు ఓపెనర్లు డక్ అవుట్ అవ్వడంతో ఇండియా టీమ్ కి కోలుకోలేని దెబ్బ పడింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా డక్ ఔట్ అవ్వడం తో అసలు ఇండియా ఈ మ్యాచ్ ఎలా గెలుస్తుంది 100 పరుగులైన అయిన కొడతారా లేదా అనే డైలమాలో ప్రతి ఒక్కరు పడిపోయారు. కానీ విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ ఇద్దరు కలిసి టీం స్కోర్ ను చక్కదిద్దుతూ ఇండియా టీమ్ మ్యాచ్ గెలిచే దిశగా తీసుకుపోయారు. ఇద్దరు ఆఫ్ సెంచరీ లు చేసి టీమ్ స్కోర్ ని పరుగులు పెట్టిస్తున్నారు… ఆ క్రమంలోనే కోహ్లీ ఇంతకు ముందు ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయడం జరిగింది…