Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహానికి మరో రికార్డు చేరువైంది. సరికొత్త రికార్డును మన కోహ్లీ బద్దలు కొట్టాడు. మొన్న పాకిస్తాన్ తో .. ఆ తర్వాత నెదర్లాండ్స్ తో ఇప్పుడు బంగ్లాదేశ్ తోనూ విరాట్ కోహ్లీ దంచికొట్టాడు. ఒక్క సౌతాఫ్రికాతో మ్యాచ్ లో తప్పితే అన్ని మ్యాచుల్లోనూ అర్థసెంచరీలతో కదం తొక్కడం విశేషం.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. కోహ్లీ కొత్త మైలురాయిని అధిగమించాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. శ్రీలంక బ్యాటర్ మహేళ జయవర్ధణే పేరిట ఉన్నరికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో శ్రీలంక క్రికెటర్ జయవర్ధణే 1016 పరుగులతో నంబర్ 1గా ఉన్నారు. 31 ఇన్నింగ్స్ లలో జయవర్ధేణే ఈ పరుగులు సాధించాడు. అయితే మన కోహ్లీ తాజాగా బంగ్లాదేశ్ పై అర్థసెంచరీ చేయడంతో ఈ రికార్డును అధిగమించాడు. కేవలం 25 ఇన్నింగ్స్ లలోనే 1016 పరుగులనే దాటేశాడు. బంగ్లాతో మ్యాచ్ లో 16 పరుగులు పూర్తి చేయగానే.. వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కోహ్లీ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు.
2014,2016 వరల్డ్ కప్ మ్యాచుల్లో కూడా విరాట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో కోహ్లీనే లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఆ టోర్నీలో కోహ్లీ అత్యధికంగా 319 రన్స్ చేశాడు. అయితే ఆ టోర్నీలో ఫైనల్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోయింది. 2016లో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఆ ఎడిషన్ లో అతడు 273 రన్స్ చేశాడు. కొత్త మైలురాయిని చేరుకున్న కోహ్లీకి బీసీసీఐ, ఐసీసీ ట్విట్టర్ ద్వారా కంగ్రాట్స్ తెలిపింది.