Prabhas Brother Pramod: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ఒకరు అనే విషయం మన అందరికి తెలిసిందే..అతను ఎంత సంపాదించిన ప్రతి రెమ్యూనరేషన్ బిల్లుకి తగ్గట్టు గా జీఎస్టీ టాక్సు నుండి అన్ని విధమైన టాక్సులకు సరైన రికార్డు తో లెక్క ఉంటుంది..కానీ ఆయన అన్నయ్య ప్రమోద్ మరియు అతని స్నేహితులు కలిసి స్థాపించిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై జీఎస్టీ మరియు ఇన్కమ్ టాక్స్ అధికారులకు ఈమధ్య అనుమానం వచ్చిందట.

దీనితో హైదరాబాద్ లో ఉన్న కావూరి హిల్స్ లోని యూవీ క్రియేషన్స్ కార్యాలయం పై IT అధికారులు దాడులు చేసారు..యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇప్పటి వరుకు నిర్మించిన సినిమాల ఆదాయం తాలూకు టాస్కులు మరియు ఇతర లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని సోదాలు జరిపారు..అయితే ఈ సోదాలలో కొన్ని అనూహ్యమైన విషయాలు బయటపడ్డాయి..అవేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
జీఎస్టీ అధికారులకు లెక్కలన్నీ పరిశీలించిన తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ కి సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నట్టు తేలింది..దీనికి సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనపర్చుకున్నారు..అంతే కాకుండా వచ్చిన ఆదాయం కి , చెల్లిస్తున్న జీఎస్టీకి మధ్య చాలా తేడాలు ఉండడం కూడా గమనించారు..ఇది ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది..యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇప్పటి వరుకు జిల్,రన్ రాజా రన్, మిర్చి, సాహూ మరియు రాధే శ్యామ్ వంటి సినిమాలు తెరకెక్కాయి..వీటిల్లో రన్ రాజా రన్ మరియు మిర్చి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవగా మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..కానీ సాహూ మరియు రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ యూవీ క్రియేషన్స్ కి ఎలాంటి నష్టం కలుగలేదు..ఎందుకంటే ఈ రెండు సినిమాలకు అన్నీ ప్రాంతాలలో టేబుల్ ప్రాఫిట్స్ తో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

వీటితో పాటుగా డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ ద్వారా ఈ రెండు సినిమాలకు అద్భుతమైన బిజినెస్ జరిగింది..కానీ దానికి తగట్టుగా పన్నులు చెల్లించలేదని ఈ రైడ్ లో తేలిందట..అంతే కాకుండా యూవీ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ రంగం లో కూడా ఉంది..వీటితో రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి ఎన్నో థియేటర్స్ కూడా ఉన్నాయి.