టీమిండియా సారధి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట గురించి అందరికీ తెలుసు. కొంత కాలం లవ్ జర్నీ కొనసాగించిన ఈ జంట.. ఆ తర్వాత ఒక్కటైంది. 2017లో విరాట్ కోహ్లీ అనుష్క శర్మని వివాహం చేసుకున్నరు. అయితే.. అనుష్క శర్మని వివాహం చేసుకోవడానికి ముందు.. ఓ మహిళా క్రికెటర్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. ఆమె కోసం ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి ఆ క్రికెటర్ గదికి చేరుకున్నాడట.

ఆమె మరెవరో కాదు.. ఇంగ్లండ్ క్రికెటర్ సారా టైలర్. ఈ మహిళా క్రికెటర్ అందానికి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సారాను విరాట్ కోహ్లీ ఇష్టపడ్డాడట. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఉదయం ఐదు గంటలకే సారా టైలర్ గదికి చేరుకున్నాడట. అంతేకాదు విరాట్ కోహ్లీ, సారా టైలర్ చాలా సార్లు చట్టాపట్టాలు వేసుకుని తిరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఏం జరిగిందో తెలియదు.. పెళ్లి వరకు మాత్రం వెళ్లలేదు.

ఆ తర్వాత అనుష్కను పెళ్లి చేసుకున్నాడు.. వీరిద్దరూ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి విరాట్-సారా లవ్ మ్యాటర్ ఇప్పుడెందుకు బయటకు వచ్చిందంటే..
ఇంగ్లండ్ ఉమెన్ క్రికెటర్ కేట్ క్రాస్ 2019లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. సారా.. నిన్ను కలవడానికి విరాట్ కోహ్లీ తాపత్రయపడుతున్నాడంటూ ఆమె ట్వీట్ చేసింది. దీనికి సారా టైలర్ కూడా స్పందించి ట్వీట్ చేసింది. “ఉదయం ఐదు గంటలకే అనుకోని కాల్ ఒకటి వచ్చింది” అంటూ ట్వీట్ చేసింది. ఈ పాత ట్వీట్ ను ఎవరు బయటకు తెచ్చారో తెలియదుగానీ వైరల్ అయ్యింది.