https://oktelugu.com/

Vinesh Phogat : అథ్లెట్ల కష్టం నెత్తి మాసిన కాస్ కు ఏం తెలుస్తుంది? ఏకిపడేస్తున్న నెటిజన్లు..వైరల్ గా వినేశ్ ఫొగాట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో కుస్తీ పోటీలలో చివరి అంచ దాకా వెళ్ళిన మల్ల యోధురాలిగా వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. అయితే ఫైనల్ పోటీలకు ముందు ఆమె వంద గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో.. అనర్హత వేటుకు గురైంది. ఫలితంగా ఆమె ఏ మెడల్ సాధించలేకపోయింది. దీంతో ఆమె కాస్ గడప తొక్కింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 16, 2024 / 06:53 PM IST

    Vinash phoghat Reaction CAS verdict

    Follow us on

    Vinesh Phogat: పారిస్ ఒలంపిక్స్ లో 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందనే కారణంతో.. భారత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ ఫైనల్ లో తలపడే అర్హతను కోల్పోయింది. పారిస్ ఒలింపిక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ( కాస్) ను ఆశ్రయించింది. వాదనలు విన్న కాస్.. తన తీర్పులో మూడుసార్లు వాయిదా వేసింది. ఆ తర్వాత ఆగస్టు 14న తీర్పును వెల్లడించింది. వినేశ్ పై విధించిన అనర్హత సరైనదేనని పేర్కొన్నది. ఇక అప్పటినుంచి వినేశ్ కు మన దేశం యావత్తు మొత్తం అండగా నిలిచింది. ఈ క్రమంలో వినేశ్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆమె విలపిస్తున్న ఒక ఫోటోకు.. హృదయ విదారకమైన పాటను జత చేసింది. కాస్ తీర్పు వల్ల తాను తీవ్రంగా బాధపడుతున్నట్టు వెల్లడించింది. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాలలో తెగ సర్కులేట్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమెను అనునయించే ప్రయత్నం చేస్తున్నారు. ” మెడల్ రాకుండా పర్వాలేదు. మీరు మా దృష్టిలో గోల్డ్ మెడల్ సాధించిన మల్ల యోధురాలు. మీ ప్రతిభ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే.. దేశం మీ పోరాటాన్ని మర్చిపోలేదు. మీ ఆటను కూడా మర్చిపోలేదు. మీరు మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ తెగువను కోల్పోవద్దని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో కుస్తీ పోటీలలో చివరి అంచ దాకా వెళ్ళిన మల్ల యోధురాలిగా వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. అయితే ఫైనల్ పోటీలకు ముందు ఆమె వంద గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో.. అనర్హత వేటుకు గురైంది. ఫలితంగా ఆమె ఏ మెడల్ సాధించలేకపోయింది. దీంతో ఆమె కాస్ గడప తొక్కింది. అయినప్పటికీ ఆమెకు నిరాశ ఎదురయింది.

    తాను ఫైనల్ దాకా వెళ్ళిన నేపథ్యంలో..రజత పతకం ఇవ్వాలని వినేశ్ ఫొగాట్ విజ్ఞప్తి చేసింది. ఆమె విజ్ఞప్తిని కాస్ నిర్ద్వంద్వంగా కొట్టి పారేసింది.. ఆమె విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నామని అడ్ హక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ తీర్పును వెల్లడించారు. ఈ తీర్పుపై ఇప్పటికే భారత ఒలంపిక్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు వినేశ్ కు ఎల్లవేళలా అండగా ఉంటామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష భరోసా ఇచ్చారు..ఐతే వినేశ్ విజ్ఞప్తిని తిరస్కరించేందుకు గల కారణాన్ని కాస్ ప్రకటించలేదు. ఇదే విషయాన్ని వినేశ్ తరఫున కేసు వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన విదుష్పత్ సింఘానియా అన్నారు. ఈ తీర్పు సంబంధించిన పూర్తి ఆర్డర్ కాపీ తనకు అందలేదని అన్నారు. సింగిల్ ఆర్డర్ మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. కాస్ తీర్పులో సవాల్ చేస్తూ 30 రోజుల్లో స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్ అప్పీల్ చేసేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు.