https://oktelugu.com/

PM Modi : ఉమ్మడి పౌరస్మృతి బదులు లౌకిక పౌరస్మృతి ని మోడీ ఎందుకు ఎంచుకున్నాడు?

ఉమ్మడి పౌరస్మృతి బదులు లౌకిక పౌరస్మృతి ని మోడీ ఎందుకు ఎంచుకున్నాడు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2024 / 07:06 PM IST

    PM Modi : నిన్నటి ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోడీ కొత్త స్లోగన్ ఒకటి తీసుకున్నాడు. లౌకిక పౌరస్మృతి అనే నినాదం చేశాడు. కొత్తగా ఉంది ఈ స్లోగన్. ఇంతవరకూ ఇలాంటిది వినలేదు.రాజ్యాంగంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుచేయమని ఉంది. అయితే మోడీ చెప్పిన ‘లౌకిక పౌరస్మృతి’ అంటే ఏంటి? అని చూస్తే.. ‘దేశ పౌరులందరికీ ఒకటే చట్టం ఉండాలి’ అన్నది మోడీ నినాదం యొక్క అసలు పాయింట్.. దేశంలో ఇది అమలు కాదని మోడీకి తెలుసు.

    దేశంలోని ఆదీవాసులకు ఈ చట్టం అమలు చేయలేమని మోడీకి తెలుసు. వీళ్ల ఆచారాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.వాళ్ల ఆచారాలను డిస్ట్రబ్ చేయదలుచుకోలేదు. వాళ్లు ఈ దేశ మూలాలు కలిగిన వారు. ఉమ్మడి పౌరస్మృతి అన్నది సాధ్యం కాదని మోడీ ఒక నిర్ణయానికి వచ్చాడు.

    మత ఆధారిత చట్టాలు ఉండకూడదని ప్రధాని మోడీ భావిస్తున్నారు. అధునాతన ప్రజాస్వామ్య దేశాల్లో మత ఆధారిత చట్టాలు లేవు. అందరికీ ఒకటే చట్టం. కానీ దేశంలో అలాంటివి లేవు. భారత్ లో మోడీ అమలు చేయదలచుకున్న‘లౌకిక పౌరస్మృతి’లో మత ప్రాతిపదికన హక్కులు అందరికీ ఒకేలా ఉండాలన్నది మోడీ భావన..

    ముస్లింలకు ఒకచట్టం.. హిందువులకు ఒక చట్టం అంటూ ఉండకూడదన్నది మోడీ  భావన.. అందుకే ఈ లౌకిక పౌరస్మృతిని తీసుకురావాలని అనుకుంటున్నారు.

    ఉమ్మడి పౌరస్మృతి బదులు లౌకిక పౌరస్మృతి ని మోడీ ఎందుకు ఎంచుకున్నాడు?  అన్న దానిపై ‘రామ్’  గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.