Venkatesh: ప్రస్తుతం ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి దృష్టి కూడా వరల్డ్ కప్ పైనే ఉంది. ఇక వరల్డ్ కప్ లో ఇండియా అద్భుతమైన ఆటతీరును కమబరుస్తుంటే ఇక మన హీరోల దగ్గర నుంచి సాధారణ క్రికెట్ అభిమాని వరకు అందరూ కూడా ఇండియా కప్పు కొట్టాలని కోరుకుంటూన్నారు.ఈ క్రమంలోనే ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించడం జరిగింది.
దాంతో ఇండియా వరుసగా 6 వ విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఈ సమయంలో లక్నోలో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ ఆ మ్యాచ్ చూడటానికి వచ్చి సందడి చేయడం జరిగింది.ఇక మొదటి నుంచి కూడా వెంకటేష్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం అందుకే తను వరల్డ్ కప్ జరుగుతున్న ప్రతిసారి స్టేడియం కి వెళ్లి అక్కడే మ్యాచ్ చూడడం జరుగుతుంది.ఇక ఇప్పుడు కూడా ఈ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యం లో ఆయన గ్రౌండ్ కి వెళ్లి మ్యాచ్ చూస్తూ ప్లేయర్లని ఎంకరేజ్ చేస్తూ ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపు కామెంటరీ కూడా చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంలోనే ఆయన ఈ టోర్నీ లో ఫైనల్ కి వెళ్లే టీములు ఏవో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆడుతున్న ఆట తీరును బట్టి చూస్తే ఇండియా తో పాటుగా న్యూజిలాండ్ టీమ్ ఫైనల్ కి వచ్చే అవకాశం ఉంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంక దానికి తగ్గట్టుగానే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టీంలు కూడా అద్భుతమైన ప్రదర్శనని కనబరుస్తున్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది…దాంతోపాటుగా ఈ ఇయర్ మూడో వరల్డ్ కప్ ను ఇండియా కొట్టబోతుంది అంటూ కాన్ఫిడెంట్ గా ఒక స్టేట్మెంట్ ని కూడా ఇచ్చి క్రికెట్ అభిమానులను సంతోషపెట్టడం జరిగింది.
ఇక వెంకటేష్ అలాంటి మాటలు మాట్లాడుతూ అభిమానులను ఎంకరేజ్ చేసిన వెంకటేష్ గారిని సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యాన్స్ తో పాటుగా, క్రికెట్ అభిమానులు కూడా అభినందిస్తున్నారు… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వెంకటేష్ చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరు కూడా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటాయి. కాబట్టి ఆయన సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది.ఇక సినిమా తో పాటు గా తనకున్న మరో ఇంట్రెస్ట్ క్రికెట్ అందువల్లే ఆయన ప్రతిసారి క్రికెట్ మ్యాచ్ లను ఎక్కువగా చూస్తూ మన మ్యాచ్ లు గెలవలనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు…
ఆయన క్రికెట్ చూడడమే కాకుండా బాగా ఆడతాడు అందులో భాగంగానే సెలబ్రిటీ లీగ్ మ్యాచ్ లు జరిగినప్పుడు అందులో పాల్గొని చాలా మ్యాచులను కూడా తనే గెలిపించడం జరిగింది. ఇంకా అప్పట్లో అయితే వెంకటేష్ టీం కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు…. అలాగే 2011లో ఇండియాకి వరల్డ్ కప్ వచ్చిన సందర్భంలో తను అప్పటి ప్లేయర్స్ తో కలిసి సందడి చేసిన విషయాలను కూడా గుర్తు చేసుకున్నాడు…