https://oktelugu.com/

Anushka Sharma: నిజంగానే అనుష్క శర్మ ఆ స్టార్ హీరోతో రిలేషన్ మెయింటెన్ చేసిందా?

ఈ షోలో పాల్గొన్న రణవీర్ ప్రముఖ హీరోయిన్ తో డేటింగ్ చేసానని.. ఆమెతో విడిపోయిన తర్వాతనే దీపికను కలిశాను అని తెలిపారు. అయితే ఆ ప్రముఖ హీరోయిన్ ఎవరో కాదు...

Written By:
  • Neelambaram
  • , Updated On : October 30, 2023 / 02:46 PM IST
    Follow us on

    Anushka Sharma: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో అనుష్క శర్మ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. ఈ అమ్మడుకు టాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించింది అనుష్క. ఈమె ఒక సినిమాలో నటిస్తుందంటే.. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫుల్ గా ఎదురుచూస్తుంటారు అభిమానులు. అంతే కాదు ఈ అమ్మడు క్యూట్ లుక్స్ కు తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమంది ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ ఎనిమిదో సీజన్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీలో ప్రసారమవుతోంది.

    ఈ షోలో పాల్గొన్న రణవీర్ ప్రముఖ హీరోయిన్ తో డేటింగ్ చేసానని.. ఆమెతో విడిపోయిన తర్వాతనే దీపికను కలిశాను అని తెలిపారు. అయితే ఆ ప్రముఖ హీరోయిన్ ఎవరో కాదు అనుష్క శర్మ అనే టాక్ వచ్చింది. ఇదే సందర్భంగా అనుష్క కూడా ముందు ఎవరితో రిలేషన్ లో ఉందనే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అయితే అనుష్క గతంలో రణవీర్ తో డేటింగ్ గురించి గతంలోనే కొన్ని కామెంట్లు చేసింది. వీరిద్దరి మెంటాలిటీ, ఆలోచన ధోరణి విభిన్నంగా ఉండేదని.. ఈ విషయం ప్రజలకు తెలుసని పేర్కొంది అనుష్క. అందుకే వీరిద్దరి మధ్య సరైనా రిలేషన్ లేదని తెలిపింది. అంతేకాదు ఇద్దరికి కోపం ఎక్కువ అని.. ఆ కోపంలో ఎవరు ఏమైనా చేసే వ్యక్తిత్వం ఉందనే విధంగా మాట్లాడింది అనుష్క శర్మ.

    లైఫ్ ను ఇద్దరు వేరువేరు యాంగిల్స్ లో చూస్తారట.. అలాంటప్పుడు వీరిద్దరు రిలేషన్ లో ఉంటే విభిన్నంగా ఉండాలని కోరుకుంటాం కానీ సాఫీగా ఎలా సాగుతుంది? అని ఒకసారి పేర్కొంది అనుష్క శర్మ. అంతేకాదు రణవీర్ ప్రాక్టిల్ గా ఆలోచించే వ్యక్తి అని.. తను మాత్రం ఆ విషయంలో చాలా నెగిటివ్ అని తెలిపింది. అంతేకాదు ఇద్దరు కనుక రిలేషన్ లో ఉంటే అవతల పర్సన్ ని అర్థం చేసుకొని కూల్ చేయాల్సి ఉంటుందని కానీ వీరిద్దరిలో అది జరగదని తెలిపింది కూడా.. కానీ రిలేషన్ లో ఉన్నప్పుడు అలా చేయకపోతే ఆ రిలేషన్ కే అర్థం ఉండదు కదా.. అంటూ పేర్కొంది. కానీ ఇద్దరిది డిఫరెంట్ మెంటాలిటీ కాబట్టి ఈ విషయంలో ఒకటిగా ఉండడం కష్టమే అంటున్నారు నెటిజన్లు. ఇక అనుష్క చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. మొత్తం మీద అనుష్క శర్మ స్టార్ హీరోతో రిలేషన్ లో ఉందనేది పక్కా అంటున్నారు నెటిజన్లు.