Anasuya: బుల్లితెర మీద యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద మంచి నటిగా గుర్తింపు పొందిన నటి అనసూయ…ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈమె సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె కెరియర్ లో ది బెస్ట్ క్యారెక్టర్ అనే చెప్పాలి.
ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకి విపరీతమైన అవకాశాలు వచ్చాయి. ఈ క్యారెక్టర్ లో ఆమె తప్ప ఎవరూ చేయలేరు అన్నంత రేంజ్ లో ఆమె నటించి మెప్పించింది.అందుకే ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ అండరేటెడ్ నటి గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలో జీ తెలుగు ఛానెల్ వారు నిర్వహించిన ఒక ఈవెంట్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకొని చాలా సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ లలో ప్రస్తుతం మన మధ్య లేకుండా పోయిన కొంత మంది హీరోయిన్లకి ట్రిబ్యూట్ చేస్తూ అనసూయ వాళ్ళని ఇమిటెడ్ చేయడం జరిగింది.
ఇక అందులో భాగంగానే ఆ ఛానల్ వాళ్ళు ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేయడం జరిగింది.అనసూయ సావిత్రి,సౌందర్య, శ్రీదేవి, జమున లాంటి హీరోయిన్స్ ని ఇమిటేట్ చేయడం జరిగింది అయితే చాలామంది అనసూయ అచ్చం సావిత్రి గారు ఎలాగైతే నటించేవారో అలానే నటిస్తున్నారు అంటూ అనసూయ ని పొగుడుతుంటే, మరి కొందరు మాత్రం సావిత్రి, సౌందర్య, శ్రీదేవి జమున లాంటి వారిలా నటించడం అంటే అంత ఈజీ కాదు.చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎక్స్ పోజ్ చేసినంత ఈజీ కాదు అనసూయ అంటూ అనసూయ ని టార్గెట్ చేస్తూ ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది.
ఇక దానికి స్పందించిన అనసూయ కాముగా సమాధానం చెబుతూ అవునండీ మీరు చెప్పింది కరెక్ట్ సావిత్రి గారిలా నటించడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆమె ఒక గొప్ప నటి ఆవిడతో పోల్చుకోవడం కూడా కరెక్ట్ కాదు అంటూ చెబుతూనే, అలాగే చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ ఎక్స్ పోజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు దానికి మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని దాటుకొని వచ్చిన తర్వాతే మనం ఎక్స్ పోజింగ్ చేయడం జరుగుతుంది. అంటూ వాళ్లకి ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది… అనసూయ ఒకప్పటిలా ఇప్పుడు ప్రతి విషయానికి రెస్పాండ్ అయి వివాదాల్లో ఇరుక్కోవడం లేదు.ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా తాను ఇన్వాల్వ్ అయి వివాదాల్లో ఇరుక్కునేది కానీ ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిన సరే సింపుల్ గా సాల్వ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది…