Venkatesh Iyer: కోల్ కతా జట్టు విజేతగా ఆవిర్భవించిన తర్వాత వెంకటేష్ అయ్యర్ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు శృతిని వివాహం చేసుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ సహజంగా రఫ్ లుక్ లో కనిపిస్తుంటాడు. గడ్డం, జుట్టును పెంచి దర్శనమిస్తుంటాడు. అతడిని చూసిన వారంతా ఊర మాస్ అనుకుంటారు. చాలా సంవత్సరాల పాటు వెంకటేష్ ఇదే మేకోవర్ కంటిన్యూ చేశాడు. చివరికి తన పెళ్లి సమయంలోనూ ఇదే గెటప్ లో కనిపించాడు. అయితే ఇన్నాళ్లకు ఏమనిపించిందో తెలియదు కానీ వెంకటేష్ తన రూపు మొత్తం మార్చుకున్నాడు. పెరిగిన గడ్డాన్ని, జుట్టును కత్తిరించుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ గా మారిపోయాడు. చూస్తుంటే స్మార్ట్ లుక్ లో ఒదిగిపోయాడు. ఇది చూసిన శృతి తట్టుకోలేకపోయింది. భర్త ఒక్కసారిగా తన మేకోవర్ మార్చుకోవడంతో ఆశ్చర్యానికి గురైంది. ఇదే సమయంలో తన భావాలను వ్యక్తం చేసింది.
ఫన్నీ వీడియో
తన భర్త అలా మారిపోవడానికి చూసి శృతి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇదే సమయంలో ఒక ఫన్నీ వీడియో రూపొందించింది. దానిని పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో కామెంట్ చేసింది.. తన భర్త ఇలా మారిపోవడం గొప్పగా ఉందని పేర్కొంది. స్మార్ట్ గా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో బ్రో నన్ను దగ్గరికి తీసుకో అంటూ కామెంట్స్ చేసింది. మరో వైపు వెంకటేష్ అయ్యర్ ను ఈసారి సీజన్లో కోల్ కతా జట్టుకు కెప్టెన్ గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ను ఇటీవలి ఐపిఎల్ మెగా వేలంలో పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. భారీ ధర చెల్లించి అతడిని కెప్టెన్ గా నియమించనుంది. దీంతో కోల్ కతా జట్టుకు నాయకత్వ లేమి ఏర్పడింది. ఈ క్రమంలోనే వెంకటేష్ అయ్యర్ ను కెప్టెన్ ను చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గనుక వెంకటేష్ అయ్యర్ కెప్టెన్ అయితే కోల్ కతా జట్టు పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుందని.. అతడు జట్టు రూపాన్ని మొత్తం మార్చేస్తాడని.. అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆకాశమే హద్దుగా చివరికి పోయే వెంకటేష్ అయ్యర్.. ఈ సీజన్లో అద్భుతాలు సృష్టిస్తాడని అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ” వెంకటేష్ కోల్ కతా ను తిరుగులేని స్థానంలో నిలుపుతాడు. ఇందులో అనుమానం లేదు. అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును ముందుకు నడిపించగలడు. అతడిలో ధైర్యం ఎక్కువ. దూకుడు తనం ఎక్కువ. అందువల్లే గొప్పగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్ కూడా అదే స్థాయిలో చేస్తాడు. ఫీల్డింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న ఆటగాడని” అభిమానులు పేర్కొంటున్నారు.
— Cricket Fan (@Cricketfan_five) January 8, 2025