Venkatesh Iyer Marriage: టీమిండియా క్రికెటర్, ఐపీఎల్ లో కోల్ కతా జట్టు కీలక ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యాడు.. తన స్నేహితురాలు శృతి రంగనాథన్ ను ఆదివారం అతడు వివాహం చేసుకున్నాడు. బంధువులు, దగ్గరి మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా వెంకటేష్ అయ్యర్ వివాహం జరిగింది. వెంకటేష్ అయ్యర్ భారత జట్టు తరఫున ఇప్పటివరకు 9 t20లు, రెండు వన్డేలు ఆడాడు.. వచ్చిన అవకాశాలను అంతగా వినియోగించుకోకపోవడంతో.. అతడికి జట్టులో స్థిరమైన స్థానం అంటూ లేకుండా పోయింది. ఇక ఐపీఎల్ లో కోల్ కతా జట్టు తరపున వెంకటేష్ అయ్యర్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 50 మ్యాచ్లు ఆడాడు. 1,326 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. కోల్ కతా జట్టు ఇటీవలి ఐపిఎల్ లో వరస విజయాలు సాధించడంలో వెంకటేష్ అయ్యర్ పాత్ర ఉంది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు ఉండి..కోల్ కతా జట్టును గెలిపించాడు.
వెంకటేష్ అయ్యర్ శృతి తో ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పట్లో ఈ నిశ్చితార్థ వేడుక అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగింది. శృతి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో మాస్టర్స్ పూర్తి చేసింది. బెంగళూరులోని ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఆమె ఉన్నతోద్యోగం చేస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా శృతి, వెంకటేష్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత.. దానిని మరో స్థాయికి తీసుకెళ్ళేందుకు వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ రెండున వివాహం చేసుకున్నారు.
వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అనతి కాలంలోనే కోల్ కతా జట్టు ఆటగాడిగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో వెంకటేష్ రాణిస్తున్నాడు. 2021 ఐపిఎల్ సీజన్లో అదిరిపోయే ఆట తీరు ప్రదర్శించాడు. పది మ్యాచ్లలో 41.11 సగటుతో 370 రన్స్ చేశాడు. దీంతో అతడు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. గత ఏడాది మినీ వేళలో వెంకటేష్ అయ్యర్ ను కోల్ కతా జట్టు దాదాపు 8 కోట్లకు కొనుగోలు చేసింది.. వచ్చే సీజన్ కు కూడా వెంకటేష్ అయ్యర్ ను కోల్ కతా జట్టు రిటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వెంకటేష్ ఇప్పటివరకు భారత జట్టు తరఫున 9 t20లు, రెండు వన్డే మ్యాచ్లు ఆడాడు. గత ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాలో వెంకటేష్ ఆడాడు.