Vaibhav Suryavanshi : వైభవ్ సూర్య వంశి. అతడికి ఇంకా నూనూగు మీసాలు కూడా రాలేదు. తన తోటి పిల్లలు పాఠశాలల్లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. ఇతడేమో బ్యాట్ చేత పట్టుకొని ఆడుతున్నాడు. పాఠశాలలకు బదులుగా నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. టోర్నీల పేరుతో దేశ విదేశాలు తిరుగుతున్నాడు. అతడు ఇప్పుడు ఏకంగా భారత జట్టుకు భవిష్యత్తు ఆశాకిరణం మాదిరిగా కనిపిస్తున్నాడు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ 175 పరుగులు చేశాడు. టీం ఇండియాను విజేతగా నిలిపాడు. అయితే ఇంతటితోనే వైభవ్ సూర్య వంశీ ఆగిపోలేదు. అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్ సాధించిన ఘనతను జస్ట్ పక్కన పెట్టాడు. విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
వైభవ్ సూర్య వంశీ 175 పరుగులు చేయడం ద్వారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ ప్లే ఆఫ్ లో తొలిసారి 150+ పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ నిలిచాడు. 2014లో దుబాయ్ లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ 143 పరుగులు చేశాడు. 2012లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పై భారత ఆటగాడు ఉన్ముక్త్ 111* పరుగులు చేశాడు.
2002 లో ఇంగ్లాండ్ జట్టుపై అంబటి రాయుడు 177* పరుగుల తర్వాత యూత్ వన్డేలో వైభవ్ సూర్య వంశీ చేసిన 175 పరుగులు.. సెకండ్ హైయెస్ట్ స్కోర్ గా కొనసాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో దుబాయ్ లోని యూఏఈ జట్టుపై సూర్యవంశీ 171 పరుగులు చేశాడు. తద్వారా ఈ జాబితాలో రెండు, మూడు స్థానాలలో అతడు కొనసాగుతున్నాడు..
వైభవ్ సూర్య వంశీ వయసు ప్రస్తుతం 14 సంవత్సరాల 316 రోజులు. అండర్ ప్రపంచ కప్ లో ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేసిన అతి తక్కువ వయసున్న ఆటగాడు గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ పేరు మీద ఉండేది. 2010లో వెస్టిండీస్ జట్టుపై 15 సంవత్సరాల 92 రోజుల్లో అతడి సెంచరీ చేశాడు. సూర్య వంశీ (4), నజ్ముల్(1) మాత్రమే 15 సంవత్సరాలు నిండకముందు యూత్ వన్డేలలో సెంచరీలు సాధించారు.
గత ఏడాది డిసెంబర్లో విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ 14 సంవత్సరాల 272 రోజుల వయసులో సెంచరీ చేశాడు..
వైభవ్ సూర్య వంశీ 55 బంతుల్లో సెంచరీ చేశాడు. అయితే ఇతర కంటే ముందు విల్ మలాజ్ జుక్ అనే ఆస్ట్రేలియా క్రీడాకారుడు ఈ ఏడాది జరిగిన మ్యాచ్లో జపాన్ మీద 51 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. పాకిస్తాన్ ఆటగాడు కాసిం అక్రమ్ శ్రీలంక మీద 63 బంతుల్లో సెంచరీ చేశాడు. బెన్ మేయెస్ అనే ఇంగ్లాండ్ ఆటగాడు స్కాట్లాండ్ మీద ప్రస్తుత అండర్ 19 వరల్డ్ కప్ లో 65 బంతుల్లో సెంచరీ చేశాడు. భారతదేశానికి చెందిన రాజ్ బవా అనే ఆటగాడు 2022లో ఉగాండా జట్టుపై 69 బంతుల్లో సెంచరీ చేశాడు.
