Homeక్రీడలుVaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్ కు 75 పరుగులు.. అయ్యర్ తో కలిసి మూడో వికెట్ కు 60 పరుగులు.. ఇదీ మూడవ టి20 మ్యాచ్లో జింబాబ్వే మీద వైభవ్ సూర్య వంశీ విధ్వంసం.

జింబాబ్వే జట్టుతో జరిగిన మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో అవకాశం రాగానే సూర్యవంశీ అదరగొడతాడు అని అందరూ అనుకున్నారు. తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని భావించారు. దానికి తగ్గట్టుగానే అతడు బ్యాటింగ్ చేశాడు. రెండవ మ్యాచ్ మినహా.. మిగతా రెండు మ్యాచ్ లలో అతడు సత్తా చూపించాడు. తొలి మ్యాచ్ లో 19 బంతులు ఎదుర్కొని.. 50 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రెండవ మ్యాచ్ లో తొమ్మిది బంతులలో 20 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు.. ఒక సిక్సర్ ఉంది. ఇక మూడో మ్యాచ్లో 49 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

మూడో మ్యాచ్లో అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత సూర్య వంశీ తన విశ్వరూపం చూపించాడు. బౌండరీలతో హరారే మైదానాన్ని హోరెత్తించాడు. జింబాబ్వే బౌలర్ల మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఏమాత్రం కనికరం లేకుండా బ్యాటింగ్ చేశాడు. అతడి జోరు చూస్తే కచ్చితంగా సెంచరీ చేస్తాడని అభిమానులు భావించారు. అయితే ఊహించని విధంగా మద్వారే బౌలింగ్ లో ఎవాన్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉన్నంత సేపు మైదానంలో వీర విహారం చేశాడు.

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక అభిషేక్ విఫలమవుతుంటే.. సూర్య వంశీ మాత్రం తన బ్యాటింగ్ స్టైల్ రోజురోజుకు మార్చుకుంటున్నాడు. కఠినమైన బంతులకు రెస్పెక్ట్ ఇస్తూ.. లూజ్ బంతులకు సరైన పనిష్మెంట్ ఇస్తున్నాడు. తద్వారా తన పేరు మీద అనేక రికార్డులను నమోదు చేసుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్లో సూర్య వంశీ కొట్టిన కొట్టుడు బంతి స్టేడియం అవతల పడింది. అది చూసేందుకు పెద్ది సినిమా లాగా కనిపించింది. సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తుంటే పెద్ది సినిమా రిపీట్ అయిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Oktelugu Epaper