Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ అత్యంత చిన్న వయసు ఉన్న ఆటగాడిగా నిలిచాడు. శతక గర్జనతో సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే సూర్యవంశీ కంటే ముందు చాలామంది ఆటగాళ్లు క్రికెట్లో సంచనాలను సృష్టించారు. తక్కువ వయసులోనే అనితర సాధ్యమైన రికార్డులను అందుకున్నారు. ఇలా రికార్డులు సృష్టించిన పదిమంది క్రికెటర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: సూపర్ సెంచరీ.. నాన్నకు వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన కానుక..
1.సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ ముంబై జట్టు తరఫున ఆరంగేట్రం చేసినప్పుడు అతని వయసు 15 సంవత్సరాల 232 రోజులు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత చిన్న వయస్సులో సెంచరీ చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1988 సంవత్సరం ముగింపులో వినోద్ కాంబ్లీ తో కలిసి 664 పరుగుల అజేయమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత సచిన్ టీమిండియాలోకి ప్రవేశించారు.. వసీం అక్రమ్, వకార్ యూనిస్ బౌలింగ్ లో బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. 17 సంవత్సరాల వయసులో సచిన్ లార్డ్స్ లో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన మ్యాచ్‌లో తొలి టెస్ట్ సెంచరీ చేశాడు. రియర్ గార్డ్, ఎడ్డి హెమింగ్స్ బౌలింగ్‌లో సంచలనం సృష్టించాడు. ఇక సచిన్ అదే ఏడాది ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 148 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ చూసి డాన్ బ్రాడ్ మన్ భార్య పులకించిపోయింది. తన భర్తను గదిలోకి పిలిపించి.. అతడు ఆడుతున్న తీరును చూపించి..” నేను మరో బ్రాడ్ మన్ ను చూస్తున్నానని” వ్యాఖ్యానించింది.
2.గ్రేమ్ హిక్
17 సంవత్సరాల వయసులో గ్రేమ్ హిక్ క్రికెట్ లోకి ప్రవేశించాడు. 1983 ప్రపంచ కప్ లో జింబాబ్వే జట్టు ఎంపిక అయ్యాడు.. 1988లో సోమర్ సెట్ జట్టుపై ఒర్సెస్టర్ షైర్ జట్టు తరఫున 45 పరుగులు చేశాడు.. అతడు ఇన్నింగ్స్ చూసి ఇయాన్ బోథమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇది అత్యద్భుతమైన ఇన్నింగ్స్ అని కొనియాడాడు.. ఇక 21 సంవత్సరాల వయసులోనే హిక్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 1991లో ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడేందుకు అర్హత సాధించే సమయానికి హిక్ అప్పటికే 51 ఫస్ట్ క్లాస్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 41 సంవత్సరాల వయసులో హిక్ 40,000 ఫస్ట్ క్లాస్ పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 16వ ఆటగాడిగా ఉన్నాడు.
3.హసన్ రాజా
పాకిస్తాన్ జట్టుకు ఎంపికైనప్పుడు హసన్ రాజా వయసు 14 సంవత్సరాల 28 రోజులు.. తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేశాడు. అయితే వన్డే జట్టులో ప్రవేశం పొందడానికి అతడు దాదాపు 1998 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో జట్టు కోసం మెరుగైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. 2000 సంవత్సరంలో ఆగస్టులో కరాచీ హోటల్లో అమ్మాయిలతో హసన్ రాజా దొరికాడు. ఆ తర్వాత అతని కెరియర్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది.
4.సర్ లెన్ హట్టన్
17 సంవత్సరాల వయసులోనే సర్ లెన్ హట్టన్ క్రికెట్ లోకి ప్రవేశించాడు. యార్క్ షైర్ జట్టుకు కౌంటీ క్రికెట్ ఆడాడు.. వోర్సెస్టర్ షైర్ పై 196 పరుగులు చేశాడు. 1936లో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1000 పరుగు పూర్తి చేశాడు. 1937 నాటికి అతడు 2,888 పరుగులు చేశాడు.. ఓవల్ లో జరిగిన మ్యాచ్‌లో 384 పరుగులు చేశాడు. కేవలం 22 సంవత్సరాల వయసులోనే ఆస్ట్రేలియాలో బ్రాడ్ మన్ ను అవుట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
5.లారెన్స్ రోవ్
వెస్టిండీస్ జట్టుకు చెందిన ఈ ఆటగాడు 17 సంవత్సరాల వయసులోనే జాతీయ జట్టులో అవకాశం సాధించాడు. ప్రారంభంలో దూకుడుగా ఆడిన ఇతడు 26 సంవత్సరాలకే తన టెస్ట్ క్రికెట్ కెరియర్ ముగించాడు.. ఉన్నన్ని రోజులు బీభత్సమైన క్రికెట్ ఆడాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 616 పరుగులు చేశాడు. ఇతడిని ఆ రోజుల్లో గ్యారీ సోబర్స్ వారసుడిగా పేర్కొన్నారు. అయితే పేలవమైన ఫామ్ వల్ల ఇతడు జట్టులో అవకాశాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి జట్టులోకి వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
6.అలిస్టర్ కుక్
19 సంవత్సరాల వయసులో ఇతడు ఇంగ్లాండ్ జాతీయ జట్టులో అవకాశాన్ని పొందాడు. ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. యుక్త వయసులోనే కౌంటింగ్ క్రికెట్ కూడా ఆడాడు. ఆకాశమే హద్దుగా చదివిపోయాడు. చిన్న వయసులోనే..ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్‌లో సెంచరీ చేసి “పీటర్ మే” సరసన చేరాడు. నాగ్ పూర్ వేదికగా భారతజట్టుతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.. అప్పటికి అతడి వయసు 23 సంవత్సరాలు మాత్రమే. 23 సంవత్సరాల లో టెండూల్కర్, హెడ్లీ, నీల్ హార్వె, మియాందాద్, బ్రాడ్ మన్ , గ్యారీ సోబర్స్ మాత్రమే ఆరు టెస్టు సెంచరీలు చేశారు.
7.అర్జున రణ తుంగ
1996లో ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక జట్టుకు అర్జున రణ తుంగ కెప్టెన్.. 18 సంవత్సరాల వయసులోనే అతడు శ్రీలంక జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాడు. కొలంబ లోని ఆనంద కళాశాలలో జరిగిన మ్యాచ్‌లో 315 పరుగులు చేశాడు. 1982లో కొలంబోలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తరుపున మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా రణ తుంగ ఆడాడు. నాటి ఇంగ్లాండ్ బౌలర్ బాబ్ విల్లీస్ బౌలింగ్ ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. రంజన్ మధుగలే తో కలిసి ఐదో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతేకాదు ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు.
Happy birthday, Graeme Hick!
Here’s him claiming a spot on the Lord’s Honours Board in 2000 with a century against Zimbabwe, the last of his six Test tons.pic.twitter.com/upcGrOfVrN
— Wisden (@WisdenCricket) May 23, 2020
8.స్టీఫెన్ పీటర్స్
స్టీఫెన్ పీటర్స్ ఎసెక్స్, వోర్సెస్టర్ షైర్ జట్లకు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 32 సగటుతో బలమైన కెరియర్ ఏర్పరచుకున్నాడు. 19 సంవత్సరాల వయసులోనే ఇంగ్లాండ్ అండర్ -19 జట్టులోనే స్టార్ ఆటగాడిగా ఆవిర్భవించాడు. 1997 -98 లో జరిగిన ఈ సిరీస్‌లో అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు పై హాఫ్ సెంచరీ చేశాడు. పాకిస్తాన్ జట్టుపై 92 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2006లో తన కెరియర్ కు ముగింపు పలికాడు.
9.మైఖేల్ క్లార్క్
2004లో ఆస్ట్రేలియా జట్టులోకి ప్రవేశించాడు. నాడు భారత జట్టు తో జరిగిన మ్యాచ్‌లో క్లార్క్ ఆస్ట్రేలియా తరఫున 151 పరుగులు చేసి.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2003 లో 21 ఏట క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్లకు ప్రవేశించాడు. 112 వన్డేలు ఆడిన అతడు 45 సగటుతో పరుగులు చేయడం విశేషం.
10.మహమ్మద్ అష్రఫూల్
బంగ్లాదేశ్ జట్టుకు ఈ ఆడిన ఈ ఆటగాడు ఓ సంచలనం. 17 సంవత్సరాల వయసులోనే అతడు జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. 2004లో భారత జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 158 పరుగులు చేసి.. ఈ రికార్డు సృష్టించిన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. 23 సంవత్సరాల వయసులోనే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ కు దిశ దశ చూపించాడు.
Also Read: ఇష్టమైన క్రికెట్ కోసం చాలా వదులుకున్నాడు.. ఐపీఎల్ సెంచరీ వెనుక సూర్య వంశీ చేసిన త్యాగాలు ఇవీ