Vaibhav Suryavanshi : ఐపీఎల్.. రిచ్ క్రికెట్ లీగ్ మాత్రమే కాదు.. అది ఎంతోమంది వర్ధమాన ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదిక. అక్కడ ఆడేవాళ్లు మొత్తం వైల్డ్ కార్డు ఎంట్రీ గాళ్లు మాత్రమే ఉండరు.. ప్రతిభను నమ్ముకుని.. నైపుణ్యాన్ని నమ్ముకుని ఆడేవారు కూడా ఉంటారు…
ప్రతిభను, నైపుణ్యాన్ని, సామర్ధ్యాన్ని నమ్ముకుని వచ్చిన వారికి ఐపిఎల్ అనేది ఒక అద్భుతమైన వేదిక. అందుకే అక్కడ ఆడాలని.. ప్రపంచం మొత్తం ముందు హీరోగా నిలబడాలని.. నమ్మి కొనుక్కున్న జట్టుకు అండగా నిలబడాలని చాలామంది కోరుకుంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే విజయవంతమవుతారు. అలా విజయవంతమైన వారిలో ఇప్పుడు 14 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు. ఐపీఎల్ లో హేమాహేమీల లాంటి ఆటగాళ్లు ఆడుతుంటారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటారు. చివరి వరకు బంతితో, బ్యాట్ తో, ఫీల్డింగ్ తో అద్భుతాలు చేస్తుంటారు. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. విజయం దక్కితే ఎగిరి గంతులు వేస్తుంటారు. విజయం దక్కకపోతే.. కాస్త నిరాశలో కూరుకుపోతారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఓ 14 సంవత్సరాల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా తన స్టామినా ఏమిటో చూపిస్తున్నాడు.
బీహార్ నుంచి రాక..
బీహార్ రాష్ట్రంలోని తాజ్ పూర్ సమస్తిపూర్ గ్రామానికి చెందిన వైభవ్ సూర్య వంశీ.. శనివారం ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మెగా వేలంలో 1.1 కోట్లకు తనను సొంతం చేసుకున్న రాజస్థాన్ జట్టు తరఫున అతడు ఐపీఎల్లోకి ప్రవేశించాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ గాయపడిన నేపథ్యంలో.. అతని స్థానంలో జట్టులోకి ప్రవేశించాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశం తండ్రి బీహార్ రాష్ట్రంలో మామూలు గ్రామీణ స్థాయి విలేకరి. వైభవ్ సూర్య వంశీ ఆటతీరు చూసి.. అతడికి క్రికెట్ పై ఉన్న మక్కువను గమనించి.. ప్రోత్సహించాడు. తనే తొలి గురువుగా మారాడు. చదువుల్లో అతడిని ఏమాత్రం వెనుక బడనివ్వకుండా.. క్రికెట్లోనూ వెనుకంజ వేయకుండా తెరవెనక ప్రోత్సహించాడు. తన గ్రామంలో తనకున్న స్థలంలో కొడుకు కోసం ఏకంగా క్రికెట్ మైదానాన్ని రూపొందించాడు. ఇక అక్కడి నుంచి క్రికెట్ ఓనమాలు మొదలుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. రంజి జట్టులో ప్రవేశించేదాకా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చివరికి తనకోసం రాజస్థాన్, ఢిల్లీ జట్ల యాజమాన్యాలు పోటీపడేలాగా చేసుకున్నాడు. అంతిమంగా రాజస్థాన్ జట్టులో సభ్యుడు అయిపోయాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ మెగా వేలంలో తన బేస్ ప్రైస్ ను 30 లక్షలు గా వైభవ్ సూర్య వంశీ పేర్కొన్నాడు.. యువ ఆటగాడు కావడం.. పరుగులు విపరీతంగా తీస్తూ ఉండడంతో.. ఏకంగా అతడి ధరను 1.1 కోట్లకు రాజస్థాన్ జట్టు యాజమాన్యం తీసుకెళ్లింది. అత్యంత పోటీ మధ్య అతడిని దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. 1.1 కోట్లు రాజస్థాన్ జట్టు యాజమాన్యం వెచ్చించి కొనుగోలు చేసిందంటే. అతడికి ఏ మాత్రం క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దూకుడు అయిన ఆటతీరుతో.. ఒకసారిగా వెలుగులోకి వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో తమ ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు వైభవ్. శార్దూల్ ఠాకూర్ లాంటి బౌలర్ బౌలింగ్లో సిక్సర్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కేవలం 14 సంవత్సరాల వయసుకే ఇలా ఆడుతున్న వైభవ్.. వచ్చే రోజుల్లో మరింత దూకుడుగా అతడు ఆడతాడని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.