IPL 2025 : ఐపీఎల్ దాదాపు సగం ముగిసినట్టే. ఈ సీజన్లో ప్రతి జట్టు కూడా ఏడు చొప్పున మ్యాచులు ఆడాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో గుజరాత్.. సెకండ్ ప్లేస్ లో ఢిల్లీ.. థర్డ్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్, ఫోర్త్ ప్లేస్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతున్నాయి. ఇక లక్నో జట్టు, కోల్ కతా, ముంబై ఇండియన్స్ 5,6,7 ప్లేస్ లలో తిష్ట వేసుకొని కూర్చున్నాయి.. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ చివరి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.. అయితే ఈ మూడు జట్లు కూడా ఏడు చొప్పున మ్యాచులు ఆడినప్పటికీ.. కేవలం రెండు చొప్పున మాత్రమే విజయాలు సాధించాయి. ఈ మూడు జట్ల ఖాతాలలో కేవలం నాలుగు చొప్పున పాయింట్లు మాత్రమే ఉన్నాయి.
14 మ్యాచ్లు ఆడాలి
ఐపీఎల్ లో ప్రతి జట్టు కూడా 14 మ్యాచ్లు ఆడాలి. లీగ్ దశ ముగిసే వరకు టేబుల్ టాప్ -4 లో నిలిచిన జట్లకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అర్హత ఉంటుంది. వాస్తవానికి 9 మ్యాచ్ లు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఎనిమిది మ్యాచ్ లు గనుక గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్ అవకాశం లభిస్తుంది. ఇక ప్రస్తుతం ఐదు చొప్పున విజయాలతో ఉన్న గుజరాత్, ఢిల్లీ జట్లకు దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ లభించినట్టే. ఈ రెండు జట్లు ఇంకా చెరి నాలుగు చొప్పున విజయాలు నమోదు చేయాలి.. ఇక నాలుగు చొప్పున విజయాలు సాధించిన గుజరాత్, బెంగళూరు, లక్నో జట్లకు కూడా అవకాశాలు ఉన్నాయి.. ఇక మూడు చొప్పున విజయాలు సాధించిన ముంబై, కోల్ కతా కూడా తదుపరి దశలో వరుస విజయాలు సాధించాలి.
ప్లే ఆఫ్ బెర్త్ ఉంటుందా
హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై జట్లు దాదాపు ప్లే ఆఫ్ నుంచి దాదాపు తప్పుకున్నట్టే. ఈ మూడు జట్లు ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఏకంగా అద్భుతాలు జరగాలి. ఈ జట్లు ఆడే ఏడు మ్యాచ్లకు ఏడు మ్యాచ్లు గెలవాలి. లేదా మెరుగైన రన్ రేట్ తో ఆర్ మ్యాచ్లలో విజయం సాధించాలి. అయితే ఈ జట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుసగా ఏడు విజయాలు సాధించడం అంత సులభం కాదు. ఐపీఎల్ లో 16 పాయింట్లు సాధించిన జట్లకు మాత్రమే ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే అరుదైన సందర్భాల్లో 14 పాయింటులతో ప్లే ఆఫ్ వెళ్లవచ్చు. కాకపోతే మెరుగైన రన్ రేట్ వుండాలి. ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై జట్ల రన్ రేట్ అత్యంత దారుణంగా ఉంది.
హైదరాబాద్
హైదరాబాద్ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. హిట్టింగ్ అప్రోచ్ ఏమాత్రం మానుకోవడం లేదు..పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోకుండా బ్యాటర్లు ఆడుతున్నారు. దూకుడు మాత్రం వల్ల హైదరాబాద్ దారుణంగా నష్టపోతోంది. బౌలింగ్ భాగం అత్యంత దారుణంగా ఉంది. షమీ దరిద్రమైన ప్రదర్శన చూపుతున్నాడు.
చెన్నై
బ్యాటింగ్ బాగోలేదు. బౌలింగ్ లో పసలేదు. ఫీల్డింగ్లో మెరుపు లేదు. ఫలితంగా చెన్నై జట్టు అత్యంత బలహీనంగా కనిపిస్తోంది. ధోని మాత్రమే అందులో కాస్త హిట్టర్ లాగా కనిపిస్తున్నాడు.
రాజస్థాన్
రాజస్థాన్ జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ.. విభేదాలు కొంపముంచుతున్నాయి.. కెప్టెన్ సంజు శాంసన్ గాయం వల్ల లక్నోతో జరిగే మ్యాచ్ కి దూరమయ్యాడు. మరి ఈ వాతావరణంలో ఆ జట్టు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందనేది చూడాలి.