Vaibhav Suryavanshi : 18 ఎడిషన్ ఐపీఎల్ లో జట్లు మాత్రమే కాదు.. ఆటగాళ్లు కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. గతంలో ఎవరూ సాధించని ఘనతలను తమ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ కూడా చేరిపోయాడు.
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఇటీవల పక్కటెముకల గాయానికి గురయ్యాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ జట్టులో ఆడే అవకాశం వైభవ్ సూర్యవంశీకి లభించింది. వైభవ్ సూర్యవంశీ వయసు ప్రస్తుతం 14 సంవత్సరాలు. లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్ ద్వారా అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. తద్వారా అత్యంత చిన్న వయసులో ఐపీఎల్ ఆడుతున్న ఆటగాడిగా సూర్య వంశీ రికార్డు సృష్టించాడు. 14 సంవత్సరాల 23 వేల వయసులో వైభవ్ సూర్య వంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఐపీఎల్ లోకి ప్రవేశించాడు. తన తొలి మ్యాచ్ లక్నో జట్టుతో ఆడుతున్నాడు. ఈ జాబితాలో రెండవ స్థానంలో ప్రయాస్ రాయ్ బర్మన్ ఉన్నాడు. ఇతడు 16 సంవత్సరాల 157 రోజుల వయసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. 2019లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు తరఫున ఆడాడు. 2018లో పంజాబ్ జట్టు తరఫున ముజీబ్ రెహ్మాన్ ఆడాడు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాల 11 రోజులు. నాటి మ్యాచ్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడ్డాడు.. 2019లో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ లోకి రియాన్ పరాగ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాల 152 రోజులు.. 2008లో చెన్నై జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. నాటి మ్యాచ్లో ప్రదీప్ సాంగ్ వన్ 17 సంవత్సరాల 179 రోజుల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాడు.
తొలి బంతికి సిక్సర్ కొట్టింది వీళ్లే
ఐపీఎల్లో తాము ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ కూడా చేరిపోయాడు. అయితే ఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్య వంశీ ఉన్నప్పటికీ.. తొలి ఆటగాడు మాత్రం అతడు కాదు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబ్ క్వినే, రాజస్థాన్ రాయల్స్ కేవన్ కూపర్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రస్సెల్, ఢిల్లీ డేర్డెన్స్ ఆటగాడు బ్రాత్ వైట్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు అనికేత్ చౌదరి, కోల్కతా ఆటగాడు జావోన్ సీయర్ లెస్, ముంబై ఇండియన్స్ ఆటగాడు సిద్దేశ్ లాడ్ , చెన్నై ఆటగాడు మహేష్ తీక్షణ, మర చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వి, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ.. తాము ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టారు. అయితే ఈ జాబితాలో వైభవ్ సూర్యవంశం అత్యంత చిన్న వయసున్న ఆటగాడిగా రికార్డు సృష్టించడం విశేషం.