Vaibhav Suryavanshi: గెలిస్తే చాలు.. పంజాబ్, కోల్కతా ఇంటికి వెళ్ళిపోతాయి. దర్జాగా రాజస్థాన్ ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. ఈ మ్యాచ్ ఎంత కీలకమో తెలుసు. ఎలా ఆడాలో కూడా తెలుసు. ఎలా ఆడితే పరుగులు వస్తాయి కూడా తెలుసు. పైగా అతడికి భీకరమైన ట్రాక్ రికార్డు ఉంది. సెంచరీ, హాఫ్ సెంచరీలు చేసిన చరిత్ర కూడా ఉంది. అలాంటి వ్యక్తి తేలిపోయాడు. కీలకమైన దశలో తలవంచాడు. ప్రత్యర్ధి ఉచ్చును అంచనా వేయలేకపోయాడు. చివరికి నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశగా వెనక్కి వెళ్ళిపోయాడు.
ఇదంతా కూడా ఆదివారం నాడు ముంబై వేదికగా రాజస్థాన్ తలపడిన మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ ఆట తీరు గురించి.. అసలు సూర్యవంశీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వికారంగా బ్యాటింగ్ చేశాడు. బంతులను అనేక విధాలుగా వేయించుకొని అదరగొట్టాడు. దీంతో ముంబై జట్టుతో జరిగే మ్యాచ్లో అతడు అదరగొడతాడని అందరూ అనుకున్నారు. దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కున్న అతడు కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. నమన్ దీర్ బౌలింగ్లో దీపక్ చాహర్ పట్టిన క్యాచ్ కు వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
మరో ఓపెనర్ జైస్వాల్ 25 పరుగులు మాత్రమే చేశాడు. జాక్స్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. జూరల్ 38 పరుగులు చేసి బాష్ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. రియాన్ పరాగ్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. శనక 29 పరుగులు చేశాడు. ముంబై జట్టులో దీపక్ చాహర్, జాక్స్, గజన్ ఫర్, భాష్ తలా ఒక వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్లో ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాకర్థమైస్తున్నాడు. బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ శర్మను సబ్స్టిట్యూట్ ఆటగాడిగా తీసుకున్నారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఓడిపోతే మాత్రం పంజాబ్, కోల్కతా జట్లకు అవకాశం ఉంటుంది. కోల్కతా జట్టు ఒకవేళ ఢిల్లీ జట్టు మీద విజయం సాధిస్తే.. అప్పుడు నెట్ రన్ రేట్.. కీలకమవుతుంది. మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న జట్టు ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ముంబై జట్టుమీద రాజస్థాన్ గనుక విజయం సాధిస్తే ఈ సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది.
– 252 runs in 7 matches of IPL 2025
– 583 runs in 14 matches of IPL 2026VAIBHAV SURYAVANSHI ENDED IPL 2026 WITH 583 RUNS AT STRIKE RATE OF 233pic.twitter.com/ao3iPfhrmY
— Sam (@cricsam02) May 24, 2026
