Vaibhav Suryavanshi వైభవ్ సూర్యవంశీ.. మీడియాలో, సోషల్ మీడియాలో ఇప్పుడు అతడే ట్రెండ్ సెట్టర్. అతడి గురించే చర్చ.. మీసాలు కూడా రాని వయసులో.. టీన్ ఏజ్ లోకి అడుగుపెట్టి.. ఆ వయసును ఆస్వాదిస్తున్న సందర్భంలో ఐపీఎల్ లోకి ప్రవేశించాడు. అతని వయసు పిల్లలు వీడియో గేమ్‌లు ఆడుకుంటూ.. ఇంట్లో వాళ్ళ ఫోన్లలో సరదాగా ఆటలాడుకుంటూ గడుపుతుంటే.. అతడు మాత్రం పక్కా ప్రొఫెషనల్ క్రికెటర్ అవతారం ఎత్తాడు. కోట్లాదిమంది చూస్తున్న ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు తరఫున ఓపెనర్ ఆటగాడిగా రంగంలోకి వచ్చాడు. భయం అనేది తెలియనట్టు.. బెదురు అనేది తన బ్లడ్ గ్రూపులో లేనట్టు ఆడాడు. మామూలుగా కాదు.. లక్నో బౌలర్లకు ఉన్నంతసేపు సింహ స్వప్నం లాగా మిగిలాడు. తన ఐపీఎల్ కెరియర్లో ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ కు చుక్కలు చూపించాడు. ఏమాత్రం భయపడకుండా భారీగా పరుగులు తీశాడు. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. కేవలం 20 బంతులు ఎదుర్కొన్న అతడు రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేశాడు. అంతేకాదు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో తొలి వికెట్ కు 9.4 ఓవర్లలో 85 రన్స్ స్కోర్ చేశాడు.. ఇటీవల రాజస్థాన్ జట్టు సాధించిన బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో యశస్వి జైస్వాల్ – వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ తప్పకుండా ఉంటుంది.
"Vaibhav Suryavanshi crying after scoring 20-ball 34 on debut. We broke another innocent guy by constantly questioning his age." – Random Insta reel https://t.co/JJquBIDBhR pic.twitter.com/x1rZapzkPG
— Silly Point (@FarziCricketer) April 19, 2025
అవుట్ కాగానే ఏడ్చాడు
34 పరుగులు చేసిన వైభవ్ సూర్య వంశీ మార్క్ రం బౌలింగ్‌లో లక్న జట్టు కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో అతడి ప్రస్థానం 34 పరుగుల వద్ద ముగిసింది. అయితే తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి కుదిరితే సెంచరీ కొట్టి తన సత్తా చూపించాలి అనుకున్న వైభవ్ సూర్యవంశీకి మార్క్రం రూపంలో ప్రధాన అవరోధం ఎదురయింది. దీంతో అవుట్ కాగానే వైభవ్ సూర్య వంశీ నేర్చుకుంటూ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.. ఇక ఇదే క్రమంలో చాలామంది అభిమానులు వైభవ్ సూర్య వంశీ కి ధైర్యం చెబుతున్నారు. ఆడిన ఒక్క మ్యాచ్ లోనే ఇలా అవుట్ అయితే అలా ఏడుస్తున్నావ్. కానీ కోట్లకు కోట్లు డబ్బు తీసుకొని ఏమాత్రం ప్రతిభ చూపని ఆటగాళ్లు చాలామంది ఐపీఎల్ లో ఆడుతున్నారు. వారందరూ కూడా నిన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని” సోషల్ మీడియాలో నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
VAIBHAV SURYAVANSHI what a awesome debut at THE AGE OF 14
Don’t cry boi you did well Many more Will come Inshallah ♥️#RRvsLSG #RRvLSG #vaibhavsuryavanshi pic.twitter.com/XoUyA8XK9B
— (@Inayatsayyed_) April 19, 2025