Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Surya Vamsi Vs Sanju Samson: వైభవ్ సూర్య వంశీ ని.. నాడు సంజు...

Vaibhav Surya Vamsi Vs Sanju Samson: వైభవ్ సూర్య వంశీ ని.. నాడు సంజు శాంసన్ గెలక కుండా ఉండాల్సింది..

Vaibhav Surya Vamsi Vs Sanju Samson: ఏ మనిషికైనా సరే ఈగో ఉంటుంది.. దాన్ని టచ్ చేస్తే ఎక్కడో కాలుతుంది.. ఐపీఎల్ లో వైభవ్ సూర్య వంశీ కి కూడా కాలింది. పైగా అతడి వయసు 15 సంవత్సరాలు. ఉడుకు నెత్తురు.. ఉద్రేకమైన వ్యక్తిత్వం కలిగిన వయసు.. దీంతో అతడు రెచ్చిపోయాడు. తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికి మైదానంలో విధ్వంసం సృష్టించాడు. తన కోపాన్ని బంతి మీద చూపించాడు.. సీన్ కట్ చేస్తే చెన్నై జట్టుకు మర్చిపోలేని ఓటమిని అందించాడు.

వైభవ్ ఇలా రెచ్చిపోవడానికి చెన్నై బౌలర్లు మాత్రమే కాదు.. చెన్నై ఆటగాడు సంజు శాంసన్ కూడా ఒక కారణం. ఎందుకంటే అతడు ఇటీవల జరిగిన నమన్ అవార్డులలో వైభవ్ సూర్య వంశీ ని ఆట పట్టించాడు. అతడి గొంతును అనుకరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో అతడు చెప్పిన మాటలను బయటికి వెల్లడించాడు. ఆ సమయంలో వైభవ్ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. మనసులో గట్టిగా అనుకున్నాడు. ఆ తర్వాత తనదైన రోజు రానే వచ్చింది. సంజు మీద ఉన్న కోపంతో చెన్నై బౌలింగ్ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. గౌహతి మైదానంలో ప్రకంపనలు సృష్టించాడు. (ఇవి సరదాగా మాత్రమే)

ఇలా సాగుతోంది సోషల్ మీడియాలో ప్రచారం. వాస్తవానికి వైభవ్ తొలి బంతికే క్యాచ్ అవుట్ అవ్వాల్సి ఉండేది. కానీ చెన్నై ఫీల్డర్ల నిర్లక్ష్యం వల్ల అతడు జీవదానం పొందాడు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. పెద్ద పెద్ద బౌలర్లను కూడా ఇబ్బంది పెట్టాడు.. ప్రతి బంతిని బలంగా కొట్టాడు. అతని టార్గెట్ సింగిల్స్.. డబుల్స్ మీద కాదు.. బౌండరీ లనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏకపక్షంగా దాడి చేసి ప్రకంపనలు సృష్టించాడు.. ఫలితంగా చెన్నై జట్టు దారుణమైన ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చింది..

నాడు సంజు శాంసన్ కనుక హేళన చేయకుండా ఉండి ఉంటే.. అతడి గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే.. వైభవ్ సూర్య వంశీ ఇలా రెచ్చిపోయేవాడు కాదని చెన్నై అభిమానులు అంటున్నారు. దానిని మనసులో పెట్టుకొని అతడు విధ్వంసం సృష్టించాడని.. చెన్నై జట్టు ఓటమికి కారణమయ్యాడని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈసారి బలమైన జట్టు ఉన్నప్పటికీ ఇలా ఓడిపోవడాన్ని చెన్నై అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular