Usman Tariq Bowling Action: బంతిని చేతిలోకి తీసుకునే దగ్గరనుంచి విసిరే వరకు ప్రతి విషయంలోనూ ఐసిసి ఒక బౌలర్ ను నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. బంతి ఏ కోణంలో వేస్తున్నాడు.. ఎంత ఎత్తులో వేస్తున్నాడు.. అక్కడ వేసే బంతి నిబంధనలకు తగ్గట్టుగా ఉన్నదా.. ఇలా ప్రతి అంశాన్ని ఐసీసీ నిపుణుల కమిటీ పరిశీలిస్తూ ఉంటుంది.
క్రికెట్లో బ్యాటర్ కు ఎన్నైతే నిబంధనలు ఉంటాయో.. బౌలర్ కు కూడా అంతకుమించి నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనలు బౌలర్ ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించకూడదు. గతంలో చాలామంది బౌలర్లు నిబంధనలు అతిక్రమించి ఉద్వాసనకు గురయ్యారు. కొంతమంది అయితే ఐసీసీ విధించిన శిక్షకు గురయ్యారు. వారంతా కొద్దిరోజులపాటు క్రికెట్ కు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఐసీసీ పర్యవేక్షక కమిటీ పరిశీలనలో బౌలింగ్ చేసి..క్లీన్ చీట్ తెచ్చుకున్నారు.
బంతిని వేసే విషయంలో గతంలో శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్, అజంతా మెండీస్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. షోయబ్ అక్తర్ బంతిని వేసే విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వీరు ఐసీసీ పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. అందులో కమిటీ నిబంధనలకు తగ్గట్టుగా బౌలింగ్ చేసి.. తమ మీద వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టారు.
ఇప్పుడు పాకిస్తాన్ జట్టులో ఉస్మాన్ తారిఖ్ అనే బౌలర్ బౌలింగ్ యాక్షన్ పై ఆస్ట్రేలియా జట్టు ఫిర్యాదు చేసింది. ఇతడు వేసే బౌలింగ్ ను ఆస్ట్రేలియా బౌలర్లు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఆడుతున్నాయి. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్లలో పాకిస్తాన్ గెలిచింది. తద్వారా సిరీస్ సొంతం చేసుకుంది.
ఈ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్ బౌలింగ్ మీద ఆరోపణలు చేశారు. అతడి బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని పేర్కొన్నారు. అతడు బంతులు వేస్తున్నప్పుడు అనుమానస్పదంగా ఉన్నాయని.. అతడు సరైన స్థాయిలో చేతిని వంచడం లేదని.. బంతిని నిబంధనలకు అనుగుణంగా వేయడం లేదని.. బంతిని నేరుగా విసిరి వేస్తున్నాడని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐసిసి క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. మరి దీనిపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు.
PAKISTAN’S USMAN TARIQ IN BIG TROUBLE
– Cricket Australia is set to file an official complaint with the ICC about Usman Tariq’s illegal bowling action
– Today, Cameron Green seemed unhappy with Usman Tariq’s action
– What’s your take pic.twitter.com/B9bMk0tWHc
— Richard Kettleborough (@RichKettle07) January 31, 2026