USA Vs Canada: అమెరికాది అడ్డిమారి గుడ్డి ఆట కాదు భయ్యో.. 195 రన్స్ టార్గెట్ ను ఉఫ్ మని ఊదేసింది

లక్ష్య చేదన లో అమెరికా 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. జోన్స్ (90*; 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, 10 సిక్స్ లు) , ఆండ్రిస్ గోస్(65; 46 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) తో మెరుపు వేగంతో అర్థ శతకాలు సాధించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 10:59 am

USA Vs Canada

Follow us on

USA Vs Canada: టీ 20 వరల్డ్ కప్ లో అమెరికా అదరగొట్టింది. డల్లాస్ వేదికగా కెనడా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో సంచలన గెలుపు దక్కించుకుంది. గ్రూప్ – ఏ లో బోణి చేసి వారెవ్వా అనిపించింది. రెండు పాయింట్లతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి, 194 పరుగులు చేసింది. కెనడా ఇన్నింగ్స్ లో నవనీత్ దాలివాల్ (61), నికోలాస్ కీర్టన్(51) అర్థ శతకాలు చేసే ఆకట్టుకున్నారు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరి అండర్సన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం లక్ష్య చేదన లో అమెరికా 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. జోన్స్ (90*; 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, 10 సిక్స్ లు) , ఆండ్రిస్ గోస్(65; 46 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) తో మెరుపు వేగంతో అర్థ శతకాలు సాధించారు. టి20 చరిత్రలో అమెరికా జట్టుకు ఇదే రికార్డు స్థాయి చేదన.

వాస్తవానికి లక్ష్య చేదనలో అమెరికాకు ఆశించినంత స్థాయిలో శుభారంభం లభించలేదు. స్టీవెన్ టేలర్(0) గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. కెప్టెన్ మోనాన్క్ పటేల్ (16) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ క్రీజ్ లోకి అడుగుపెట్టిన తర్వాత అమెరికా ఇన్నింగ్స్ ఒకసారి గా మారిపోయింది. వీరిద్దరూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. బౌండరీలు, సిక్స్ లు కొట్టడంతో స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఫలితంగా కెనడా విధించిన లక్ష్యం కరిగిపోయింది. చివర్లో అండ్రీస్ అవుట్ అయినప్పటికీ.. జోన్స్, అండర్సన్ అమెరికాకు విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్లో అమెరికా టాస్ గెలిచి.. కెనడాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కెనడా జట్టులో ఆరోన్ జాన్సన్ (23), నవనీత్ భీకరంగా ఆడారు. అయితే స్వల్ప వ్యవధిలోనే జాన్సన్, పర్గాత్ సింగ్ (5) అవుట్ అయ్యారు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ తో కలిసి నవనీత్ కెనడా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ అర్ధ శతకాలు చేశారు. చివర్లో శ్రేయస్ 32* పరుగులు చేయడంతో కెనడా స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కాగా, ఇటీవల అమెరికా జట్టు బంగ్లాదేశ్ తో జరిగిన టి20 సిరీస్ ను దక్కించుకుంది. అదే ఊపును టి20 వరల్డ్ కప్ లోనూ కొనసాగిస్తోంది.