Indo-Gulf Tournament: ఇండో – గల్ఫ్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌గా అమెరికా

ది ఇండియన్‌ క్లబ్‌ బహ్రెయిన్‌ భాగస్వామ్యంతో కలిపి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో బహ్రెయిన్‌ నుంచి నాలుగు, అమెరికా, భారత్, సౌదీ నుంచి ఒక్కో టీం పోటీ పడ్డాయి.

Written By: Raj Shekar, Updated On : March 4, 2024 12:24 pm

USA team won Indo-Gulf Throwball Championship

Follow us on

Indo-Gulf Tournament: అంతర్జాతీయ త్రోబాల్‌ సమాఖ్య ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లో నిర్వహించిన ఇండో – గల్ఫ్‌ ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో అమెరికాకు చెందిన మహిళల జట్టు స్పోర్టీ దివాస్‌ విజేతగా నిలిచింది. ది ఇండియన్‌ క్లబ్‌ బహ్రెయిన్‌ భాగస్వామ్యంతో కలిపి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో బహ్రెయిన్‌ నుంచి నాలుగు, అమెరికా, భారత్, సౌదీ నుంచి ఒక్కో టీం పోటీ పడ్డాయి. సెమీస్‌లో సౌదీ జట్టుపై అమెరికా విజయం సాధించింది.

ఫైనల్‌ భారత్, అమెరికా మధ్య..
ఇక ఫైనల్‌ మ్యాచ్‌ భారత్, అమెరికా మధ్య జరిగింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో అమెరికా భారత్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. అమెరికా స్పోర్టీ దివాస్‌ జట్టులో వసంత కావూరి, కావ్య వుర్రాకుల, నిత్య సౌందరరాజన్, శబ్నం శంషుద్దీన్, సాయిలక్ష్మి గార్లపాటి, సృజన కుంచి, గౌతమి యలవర్తి ఉన్నారు. వీరంతా భారతీయ అమెరికన్లు. ఇక ఈ టీంను తానా సెక్రటరీ రాజా కసుకుర్తి, తానా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి, తానా ఇంటర్నేషనల్‌ కోఆర్డినేటర్‌ ఠాగూర్‌ మల్లినేని స్పాన్సర్‌ చేశారు. తమను ప్రోత్సహించిన తానా ప్రతినిధులకు, కుటుంబ సభ్యులకు విజేత జట్టు ధన్యవాదాలు తెలిపింది.

ఏళ్లుగా పోటీలు..
ఇండో–అమెరికా–గల్ఫ్‌ దేశాల మధ్య సత్సంబంధాల కోసం అనేక అంశాల మధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైనిక సంబంధాలే కాకుండా క్రీడలు, సాంస్కృతిక, వ్యాపార సంబంధాల పెంపునకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆయా దేశాల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండో అమెరికా త్రోబాల్‌ పోటీలు, ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక సైనికపరమైన అంశాల్లో అయితే భారత్‌–అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయుధాల కొనుగోలుతోపాటు, తయారీ విశయంలో భారత్‌కు అమెరికా సాయం అందిస్తూనే ఉంది. శాస్త్ర సాంకేతికరంగంలోనూ ఆమెరికా భారత్‌కు సహకారం అందిస్తోంది.