Under-19 World Cup Qualifiers: పొట్టి ఫార్మాట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రికెట్లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.. ఆటగాళ్లు అంతకు మించిన స్థాయిలో ప్రతిభను చెబుతున్న నేపథ్యంలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అండర్ 19 వరల్డ్ కప్ అమెరికా క్వాలిఫైయర్ 2025 టోర్నీలో సరికొత్త రికార్డు నమోదయింది. అర్జెంటీనాతో జరిగిన ఈ మ్యాచ్లో కెనడా ఐదు బంతుల్లోనే టార్గెట్ ఫినిష్ చేయడం విశేషం.
Also Read: కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?
టోర్నీలో భాగంగా అర్జెంటీనా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 19 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. కేవలం 23 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్జెంటీనా జట్టులో ఏడుగురు ఆటగాళ్లు 0 పరుగులు మాత్రమే చేయడం విశేషం. కెనడా బౌలర్ జగ్ మన్ దీప్ కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.. అనంతరం 24 పరుగుల లక్ష్యాన్ని కెనడా జట్టు 0.5 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. కెనడా జట్టులో కెప్టెన్ యువరాజ్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి అదరగొట్టాడు.
అర్జెంటీనా కేవలం 23 పరుగులు మాత్రమే చేయడం ద్వారా అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకుంది. వాస్తవానికి ఆటగాళ్లు ఏమాత్రం సత్తా చూపించలేకపోయారు. బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. కేవలం 19 ఓవర్లు మాత్రమే ఆడి 23 పరుగులు చేశారంటే అర్జెంటీనా ఆటగాళ్లు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అర్జెంటినా బ్యాటర్ల వైఫల్యాన్ని గమనించిన కెనడా బౌలర్లు పదేపదే షార్ట్ పిచ్ బంతులను సంధించారు. అ బంతులను ఎదుర్కోలేక అర్జెంటీనా బ్యాటర్లు చేతులెత్తేశారు..
షార్ట్ పిచ్ బంతుల వల్ల అర్జెంటిన బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అర్జెంటినా జట్టులో ఏడుగురు ఆటగాళ్లు 0 పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. వారు అలా వెంట వెంటనే అవుట్ కావడంతో అర్జెంటీనా వారి స్కోర్ చేయలేకపోయింది. అయితే 23 పరుగుల లక్ష్యాన్ని అర్జెంటీనా కాపాడుకోలేకపోయింది. తొలి ఓవర్ పూర్తికాకుండానే ఓటమిపాలైంది. పొట్టి ఫార్మాట్ లో అత్యంత వేగంగా టార్గెట్ ఫినిష్ చేసిన జట్టుగా కెనడా తన పేరు మీద సరికొత్త చరిత్రను సృష్టించుకుంది.