IPL 2022, SRH vs KKR: ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫామ్ లోకి వచ్చేసింది. హ్యాట్రిక్ విజయాలతో దుసుకెళ్తోంది. దీంతో ఆరేంజ్ ఆర్మీలో ఆశలు చిగురించాయి. మొదట రెండు ఘోర పరాజయాల్ని చవి చూసి విమర్శలపాలైంది. ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ విజయంలో సన్ రైజర్స్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు.

అలాగే వరుస విజయాలతో దూసుకెళ్తోన్న గుజరాత్ టైటాన్స్ కు చెక్ చెప్పి టోర్నీలో రెండో విజయాన్ని హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. డీవై పాటిల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై ఘనవిజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విలియమ్సన్ సేన 19.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 168 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది.
Also Read: KGF VS RRR: ‘కేజీఎఫ్’ కోసం ‘ఆర్ఆర్ఆర్’పై విషం..!
ముంబయి వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ అర్ధశతకాలతో విజృంభించగా.. ఈ ఐపీఎల్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 176 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి ఏడో స్థానాన్ని ఎగబాకింది.
అయితే మొన్నటి వరకు ఐపీఎల్ 2021 సీజన్ కు కొనసాగింపు అన్నట్లుగా 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన కొనసాగింది. గతేడాది భారత్, యూఏఈ వేదికలుగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం మూడింటిలో గెలిచిన సన్ రైజర్స్ 11 మ్యాచ్ ల్లో ఓడింది. దాంతో కేవలం 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2022 సీజన్ కు ముందు తమ పాత ఆటగాళ్లలో చాలా మందిని వదులుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్… ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో పలువురు కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాంతో ఈ ఏడాది అదరగొట్టే ప్రదర్శన కనబరుస్తామని విశ్వాసం వ్యక్తం చేసినా స్టార్ బ్యాట్స్ మెన్ లను వదులుకోవడంతో విమర్శలపాలైంది.

దీనికి తోడు మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ ఘోర పరాజయాలను మూట గట్టుకుంది. దీంతో ప్రాచైస్ ఓనర్ కావ్యా మారన్ ను కూడా తిట్టిపోశారు. చేతకాకపోతే జట్టును అమ్ముకోవాలని కూడా పలువురు కామెంట్స్ చేశారు. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో ఓడిన సన్ రైజర్స్ జట్టు… లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో ఓడింది. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్ లు రెండు మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలమయ్యారు. రెండు మ్యాచ్ ల్లోనూ ఒక్క వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఫర్వాలేదనిపించాడు.
ఐపీఎల్ అన్ని సీజన్లలో బ్యాటింగ్ పరంగా ఎలా ఉన్నా.. సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్‌లో స్ట్రాంగ్‌గానే నిలబడింది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ భువనేశ్వరర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, షెఫర్డ్, వాషింగ్టన్ సుందర్ లాంటి మేటి బౌలర్లను కొనుగోలు చేసినా.. రాజస్థాన్‌పై జరిగిన మొదటి మ్యాచ్‌లో వీరందరూ తేలిపోయారు. తర్వాత హ్యాట్రిక్ విజయాలతో జట్టుకు విజయాల బాట వేశారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగిన ప్రతి సారీ 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ పేరు ప్రస్థావన రాక మానదు. హైదరాబాద్ తరఫున బుల్లెట్ బంతులతో గత సీజన్లో అందరినీ ఆకర్షించాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ సీజన్లో రాణిస్తున్నాడు.
Also Read:Acharya: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవరంటే?
[…] Prabhas: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్. బాహుబలితో తన ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. ఆయనలోని నటనకు భాష్యం చెప్పింది. దర్శకుడు రాజమౌళి సృష్టి ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఇటీవల కాలంలో సెలబ్రీటీలు పలు వివాదాల్లో ఇరుక్కోవడం తెలిసిందే. గతంలో డ్రగ్స్ కేసులో మొత్తం సినిమా పరిశ్రమ వివాదాల్లోకి వచ్చినా తరువాత ఏమైందో కానీ దాని ఊసే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రభాస్ కూడా ఓ వివాదంలో దూరారు. […]