https://oktelugu.com/

KGF VS RRR: ‘కేజీఎఫ్’ కోసం ‘ఆర్ఆర్ఆర్’పై విషం..!

KGF VS RRR: దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే వెయ్యికోట్ల మార్క్ ను బీట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా హవా కొనసాగిస్తూనే ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం సంబురాలు చేసుకుంటోంది. ఇక కేజీఎఫ్ మొదటి పార్ట్ కు స్వికెల్ గా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2022 / 02:25 PM IST
    Follow us on

    KGF VS RRR: దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే వెయ్యికోట్ల మార్క్ ను బీట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా హవా కొనసాగిస్తూనే ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం సంబురాలు చేసుకుంటోంది.

    ఇక కేజీఎఫ్ మొదటి పార్ట్ కు స్వికెల్ గా విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రెండ్రోజుల క్రితమే విడుదలైంది. ఈ సినిమాకు క్రిటిక్స్ యావరేట్ రేటింగ్ ఇచ్చినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. కేజీఎఫ్ మొదటి పార్ట్ ను ఆదరించిన ప్రేక్షకులు కేజీఎఫ్ చాప్టర్ 2 ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో ఈ సినిమాకు కూడా ఢోకా లేదని తెలుస్తోంది.

    అయితే కొంతమంది కుహానా మేధావులు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను ప్రమోట్ చేసేందుకు తెలుగు సినిమాను కించపర్చేలా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ను కేజీఎఫ్ తో పోలిస్తూ తెలుగు సినిమాపై విషం చెప్పే ప్రయత్నాన్ని నీలి మీడియానే చేస్తోంది. కూర్చున్న కొమ్మును నరుక్కుంటున్న చందంగా తెలుగు మీడియా వ్యవహరిస్తుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

    కేజీఎఫ్ 2 మూవీ తమకు నచ్చిందనో.. లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమేగానీ సోషల్ మీడియాలో దూరుతూ తెలుగు సినిమాపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. వీటినే తెలుగు మీడియా హైలెట్ చేస్తూ ‘తెలుగు సినిమా రచయితలు అర్జెంటుగా సిగ్గుపడాలి? అన్నట్లు కథనాలు ప్రసారం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తతున్నాయి.

    కేజీఎఫ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రాసిన కొన్ని డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయని చెబుతూనే తెలుగు సినిమా రచయితలు అలాంటి డైలాగ్స్ రాయలేక పోతున్నారని విషం చిమ్ముతోంది. వీరంతా కూడా కేజీఎఫ్-2 చూసేసి డైలాగులు రాయడం నేర్చుకోవాలంటూ నీలి మీడియాకు చెందిన కొందరు ప్రబుద్ధులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

    నిజానికి ‘కేజీఎఫ్-2’లో డైలాగ్స్ అద్భుతంగానే ఉన్నాయి. అంతమాత్రనా తెలుగు సినిమా రచయితలకు డైలాగ్స్ రాయడం రాదనడం ఎంత వరకు కరెక్టో వారికే తెలియాలి. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’లో డైలాగ్స్ చూస్తే ‘కేజీఎఫ్-2’కు ఏమాత్రం తీసిపోవు. కానీ నీలి మీడియా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ‘ఆర్ఆర్ఆర్’పై తెలుగు మీడియాపై విషం చిమ్ముతుందనే టాక్ విన్పిస్తోంది.

    మరోవైపు మన తెలుగు దర్శకులు పూరి జగన్మాథ్, కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాల్లో వచ్చే డైలాగ్స్ కథ పరంగానే కాకుండా ప్రేక్షకుడి ఓ కిక్కు ఇచ్చేలా ఉంటాయి. తమదైన శైలిలో వీరంతా కూడా తెలుగుదనం ఉట్టిపడేలా చేస్తుంటారు. వీరికితోడు తెలుగు డైలాగ్ రైటర్ ఎన్నో ఆణిముత్యాల్లాంటి డైలాగ్స్ రాశావు.

    ఇవన్నీ కూడా ఈ కుహనా మేథావులు ఎందుకు కన్పించని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు నీలి మీడియా ఎవరో ప్రయోజనాలనో కాపాడేందుకు తన వక్రబుద్దిని బయటపెట్టడం మంచిది కాదని హితవు పలుకుతున్నాయి. ఇప్పటికైనా నీలి మీడియా తన పద్ధతిని మార్చుకొని తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా కథనాలు ప్రసారం చేయాలని కోరుతున్నారు.