https://oktelugu.com/

టోక్యో ఒలింపిక్స్: మన ‘సింధు’ కొత్త చరిత్ర

క్రికెట్ లో ధోని హెలిక్యాప్టర్ షాట్ కొడితే ఎగిరి గంతులేస్తాం.. అలాగే బ్యాడ్మింటన్ లో మన తెలుగు తేజం పీవీ సింధుూ స్మాష్ షాట్లను కొడుతూ ఉంటే అంతే ఎంజాయ్ చేస్తాం.. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదుర్స్ అనిపించింది. ఒలింపిక్ చరిత్రలో భారత్ తరుఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు మెడల్స్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. మన తెలుగమ్మాయి పీవీ సింధూ ఒలింపిక్స్ లో అద్భుతం సాధించింది. నిన్న సెమీస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 1, 2021 / 06:37 PM IST
    Follow us on

    క్రికెట్ లో ధోని హెలిక్యాప్టర్ షాట్ కొడితే ఎగిరి గంతులేస్తాం.. అలాగే బ్యాడ్మింటన్ లో మన తెలుగు తేజం పీవీ సింధుూ స్మాష్ షాట్లను కొడుతూ ఉంటే అంతే ఎంజాయ్ చేస్తాం.. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదుర్స్ అనిపించింది. ఒలింపిక్ చరిత్రలో భారత్ తరుఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు మెడల్స్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది.

    మన తెలుగమ్మాయి పీవీ సింధూ ఒలింపిక్స్ లో అద్భుతం సాధించింది. నిన్న సెమీస్ లో ఓడిపోయి ఫైనల్ చాన్స్ మిస్ అయినా కూడా ఈరోజు కీలకమైన కాంస్యం కోసం పోరులో సత్తాచాటింది.ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సింధు చూడముచ్చటైన ఆటతీరుతో భారత ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకం గెలుచుకుంది.

    టోక్యో ఒలింపిక్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్ జియావో తో జరిగిన పోరులో సింధు చెలరేగిపోయింది. భారీ అంచనాల నడమ ఒలింపిక్స్ కు వెళ్లిన సింధూ దాన్ని సాకారం చేసుకుంటూ భారత్ కు పతకం అందించి త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది.

    తాజా పోరులో పీవీ సింధు 21-13,21-15 తేడాతో బింగ్ జియావోపై గెలిచింది. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్ లో రజతం సాధించిన సింధూ తాజా ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించి భారత అభిమానులు పెట్టుకున్న ఆశలను నిలబెట్టింది.

    ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా సింధు కొత్త అధ్యాయం లిఖించింది. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించేకపోవడమే సింధుకు చేదు అనుభవంగా ఉంది. కాంస్యం గెలిచి ఆలోటును కాస్తంత పూరించింది. భారతీయులను ఉప్పొంగేలా చేసింది.