
టోక్యో ఒలింపిక్స్ సెమీస్ లో ఓడిపోయిన భారత మహిళల హాకీ జట్లు ఇప్పుడు కాంస్యం కోసం బ్రిటన్ దేశంతో తలపడుతోంది. రెండు జట్లు హోరాహోరీగా ఆడుతున్నాయి. మొదటి క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే బ్రిటన్ రెండు పెనాల్నీ కార్నర్ లు లభ్యమైన భారత గోల్ కీపర్ దాన్ని అడ్డుకుంది. అయితే రెండో క్వార్టర్ లో బ్రిటన్ రెచ్చిపోయి ఆడుతోంది. భారత మహిళలు పోరాడుతున్నారు.
మూడో క్వార్టర్ ముగిసేసరికి భారత్-బ్రిటన్ ఇరు జట్లు 3-3 తో సమానంగా ఉన్నాయి. తాజాగా చివరి క్వార్టర్ లోకి అడుగుపెట్టాయి. భారత్ డ్రాగ్ ఫ్లికర్ గుల్జిత్ కౌర్ టోక్యో ఒలింపిక్స్ లో నాలుగు గోల్స్ ను చేసింది. ముఖ్యంగా కాంస్యం కోసం బ్రిటన్ తో తలపడుతున్న మ్యాచ్ లో బ్రిటన్ ఆధిక్యాన్ని తగ్గించింది. వరుసవరుసగా చేసిన రెండు గోల్స్ భారత్ జట్టుకు ఊపిరి ఇచ్చాయని చెప్పవచ్చు.
రెండో క్వార్టర్ లో భారత్ కు లభించిన పెనాల్టీ కార్నర్ ను గుల్జిత్ గోల్ చేసింది. దీంతో భారత్ జట్టు బ్రిటన్ ఆధిక్యాన్ని తగ్గించింది.
నాలుగో క్వార్టర్ లో బ్రిటన్ నాలుగో గోల్ చేసింది. దీంతో భారత్ పై మళ్లీ 4-3తో లీడ్ లోకి వచ్చింది. అయితే చివరి వరకు జరిగిన పోరులో భారత మహిళల హాకీ టీం ఓడిపోయింది. 4-3 తేడాతో బ్రిటన్ గెలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ బాగా పోరాడినా కూడా గెలవలేకపోయింది.