Tokyo Olympics: సెమీస్ లో ఓటమి.. ఇండియా ఆశలు ఆవిరి

టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టు సెమీస్ లో పోరాడి ఓడింది. స్వర్ణం గెలుస్తుందని అందరూ అనుకుంటున్న వేళ ప్రపంచ నంబర్ 1, కఠిన ప్రత్యర్థి బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓటమి పాలైంది. పురుషుల హాకీ జట్టు మూడు క్వార్టర్లు అద్భుతంగా పోరాడినప్పటికీ నాలుగో క్వార్టర్ లో బెల్జియం జట్టు తన అనుభవాన్ని అంతా రంగరించి అద్భుతంగా ఆడింది. పెనాల్టీ క్వార్టర్ లతో విజయాన్ని అందుకుంది. దీంతో భారత్ పసిడి ఆశలు ఆవిరయ్యాయి. ఇక కాంస్యం […]

Written By: NARESH, Updated On : August 3, 2021 10:49 am
Follow us on

టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టు సెమీస్ లో పోరాడి ఓడింది. స్వర్ణం గెలుస్తుందని అందరూ అనుకుంటున్న వేళ ప్రపంచ నంబర్ 1, కఠిన ప్రత్యర్థి బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓటమి పాలైంది. పురుషుల హాకీ జట్టు మూడు క్వార్టర్లు అద్భుతంగా పోరాడినప్పటికీ నాలుగో క్వార్టర్ లో బెల్జియం జట్టు తన అనుభవాన్ని అంతా రంగరించి అద్భుతంగా ఆడింది. పెనాల్టీ క్వార్టర్ లతో విజయాన్ని అందుకుంది. దీంతో భారత్ పసిడి ఆశలు ఆవిరయ్యాయి. ఇక కాంస్యం కోసం భారత్ పోరాడాల్సి ఉంటుంది.

మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలో 4వ క్వార్టర్ లోనే భారత్ వెనుకబడింది. అందుకు ముందు వరకూ బాగానే ఆడింది. 2-2 గోల్స్ తో సమానంగా నిలిచింది. అయితే ఆ తర్వాత బెల్జియం వరుసగా రెండు గోల్స్ చేసింది. ఆధిక్యం 4-2తో వెళ్లింది.

ఇక భారత్ కాంస్య పతకం కోసం మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా-జర్మనీతో పోటీపడుతోంది. అందులో ఓడిన జట్టుతో భారత్ కాంస్య పతకం కోసం తలపడాల్సి ఉంటుంది.