41 ఏళ్ల తర్వాత పతకం: జయహో హాకీ ఇండియా

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది.. 135 కోట్ల భారతీయుల కలను నెరవేర్చింది. భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ లో ఓడినా కీలకమైన కాంస్యం కోసం జరిగిన పోరులో విజయం సాధించింది. జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పతక పోరులో భారత జట్టు 5-4 తేడాతో విజయాన్ని అందుకుంది. 1980 ఒలింపిక్స్ తర్వాత చివరగా పతకం గెలిచిన భారత పురుషుల హాకీ టీం ఎట్టకేలకు 41 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ […]

Written By: NARESH, Updated On : August 5, 2021 9:29 am
Follow us on

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది.. 135 కోట్ల భారతీయుల కలను నెరవేర్చింది. భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ లో ఓడినా కీలకమైన కాంస్యం కోసం జరిగిన పోరులో విజయం సాధించింది.

జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పతక పోరులో భారత జట్టు 5-4 తేడాతో విజయాన్ని అందుకుంది. 1980 ఒలింపిక్స్ తర్వాత చివరగా పతకం గెలిచిన భారత పురుషుల హాకీ టీం ఎట్టకేలకు 41 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత పతకం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించింది.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటికే వెయిట లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని అందివ్వగా.. స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సార్ లవ్లీనా కాంస్య పతకాలు అందించారు. తాజాగా హాకీ టీం కాంస్య పతకంతో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.

సెమీస్ లో అనూహ్యంగా బెల్జియం చేతిలో ఓడిన భారత్.. కాంస్యపతక పోరులో గొప్ప పోరాట పటిమను కనబర్చింది. మొన్న జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంది. అయితే మ్యాచ్ మొదలైన రెండో నిమిషంలోనే జర్మనీ షాక్ ఇచ్చింది. 1-0 గోల్ తో ఆధిక్యంలోకి వెళ్లింది. 17వ నిమిషంలో గోల్ కొట్టిన సిమ్రాన్ జీత్ ఆధిక్యాన్ని 1-1తో సమం చేశాడు. కానీ 24వ నిమిషంలోనే నిక్లాస్, 25వ నిమిషంలో బెన్ డిక్ట్ గోల్స్ చేయడంతో జర్మనీ 3-1తో ఆధిక్యంలో వెళ్లింది. దాంతో భారత్ జట్టు ఒత్తిడిలోకి వెళ్లినట్లు కనిపించింది.

28వ నిమిషంలో గోల్ చేసిన హార్ధిక్ సింగ్ జర్మనీ ఆధిక్యాన్ని 2-3కి తగ్గించగా నిమిషం వ్యవధిలోనే హర్మన్ ప్రీత్ కూడా అద్భుతమైన గోల్ తో ఆధిక్యాన్ని 3-3తో సమం చేశాడు.

ఇక అప్పటి నుంచి మ్యాచ్ మరో మలుపు తిరిగింది. భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ జర్మనీపై ఎదురుదాడి చేసి విజయాన్ని అందించారు. మొత్తంగా 41 ఏళ్ల తర్వాత భారత్ కు ఈ అద్భుత పతకం అందించి హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.