https://oktelugu.com/

Nam vs UAE :  గెలిస్తేనే నమీబియా ట్రై సిరీస్ లో నిలిచేది.. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో కీలక మ్యాచ్

నమీబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్ల మధ్య ఐసీసీ టీ - 20 ట్రై సిరీస్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐదు మ్యాచ్ లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ మెరుగు పరుచుకునేందుకు ఈ మూడు జట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 2, 2024 / 05:37 PM IST

    Nam vs UAE

    Follow us on

    Nam vs UAE :  ఇటీవల అమెరికా వేదికగా నిర్వహించిన టి20 వరల్డ్ కప్ లో యు.ఎస్.ఎ జట్టు మెరుగైన ఫలితాలు సాధించింది. బలమైన పాకిస్తాన్ మీద విజయం సాధించింది. సంచలన విజయాలతో ఏకంగా గ్రూప్ దశను విజయవంతంగా దాటింది. అయితే ఆ జట్టులో మరింత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉంటే.. ఆ జట్టు భవితవ్యం మరో విధంగా ఉండేది. ఏది ఏమైనప్పటికి t20 వరల్డ్ కప్ ద్వారా అమెరికా జట్టు గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ ట్రై సిరీస్ లో భాగంగా ఆతిధ్య నమీబియా జట్టు ఆడిన రెండు మ్యాచ్లలో ఓటమిపాలైంది. దీంతో సిరీస్ లో చివరి స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ లో నిలవాలంటే నమీబియా కచ్చితంగా గెలవాలి. ముఖ్యంగా బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో తలపడే మ్యాచ్ నమిబియాకు అత్యంత ముఖ్యమైనది. ఇక యూఏఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఒకదాంట్లో విజయం సాధించింది.. మరో దాంట్లో ఓటమిపాలైంది. ఫలితంగా టేబుల్ పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. యూఏఈ టేబుల్ జాబితాలో అగ్రస్థానంలోకి రావాలంటే ఖచ్చితంగా నమిబియా పై విజయం సాధించాల్సి ఉంది.. మొత్తంగా ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు అత్యంత ముఖ్యమైనది. అమెరికా జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

    బుధవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల నుంచి..

    భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. వండర్స్ క్రికెట్ గ్రౌండ్, విండ్ హక్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం మ్యాచ్ గెలిచేందుకు యూఏఈకి 44 శాతం, నమిబియా కు 56% అవకాశాలు ఉన్నాయి. గత ఐదు మ్యాచ్ల ప్రకారం చూసుకుంటే నమీబియా ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. యూఏఈ జట్టు రెండు విజయాలు సాధించింది. ఇక ఈ సిరీస్లో బెస్ట్ స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్న బ్యాటర్ గా నమీబియా ఆటగాడు గెర్హార్డ్ ఏరాస్మస్ కొనసాగుతున్నాడు. రెండు మ్యాచ్లు ఆడి 114 పరుగులు చేశాడు. రెండవ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆటగాడు వసీమ్ మహమ్మద్ కొనసాగుతున్నాడు. ఇతడు రెండు మ్యాచ్లలో 97 పనులు చేశాడు. మూడో స్థానంలో యూఏఈ ఆటగాడు అలిషన్ షరాఫ్ కొనసాగుతున్నాడు. ఇతడు రెండు మ్యాచ్లలో 94 పరుగులు చేశాడు. నాలుగు స్థానంలో యూఏఈ ఆటగాడు బాసిల్ హామీద్, ఐదో స్థానంలో జోనాథన్ స్మిట్ కొనసాగుతున్నాడు.

    జట్ల అంచనా ఇలా

    నమిబియా

    జీన్ పియరీ, క్రుగర్, జోనాథన్, స్మిట్, డైలాన్ లీచెర్, గెర్హార్డ్(కెప్టెన్), జాన్ ఫ్రై లింక్, జాన్ నికోల్, జాక్ బ్రాసెల్, తాంగేని, బెర్నర్డ్.

    యూఏఈ

    సయ్యద్ వాసి షా, వసీమ్ మహమ్మ ద్(కెప్టెన్), షరాఫు, విష్ణు సుకుమారన్, మహమ్మద్ ఫరూక్, అసిఫ్ ఖాన్, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, నసీర్, జునైద్ సిద్ధిక్, మహమ్మద్ జవాద్ ఉల్లా.