https://oktelugu.com/

Committee Kurrollu: ‘కమిటీ కుర్రాళ్ళు’ ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుందో తెలుసా? స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాదేమో!

ఇటీవలే ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ చేయగా ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారిగా చిన్న నాటి తీపి గుర్తులను మళ్ళీ నెమరువేసుకున్నామని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 05:33 PM IST

    Committee Kurrollu Collections

    Follow us on

    Committee Kurrollu: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘కమిటీ కుర్రాళ్ళు’. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా, కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫలితం ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించారని, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది తెలుస్తుంది. పెట్టిన డబ్బులకు 7 రెట్లు లాభం రావడం అనేది చిన్న విషయం కాదు. థియేట్రికల్ గా మాత్రమే కాకుండా, డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో 30 కోట్ల రూపాయిలు అదనంగా నిహారికకు కలిసొచ్చిందట. కంటెంట్ కి ఉన్న పవర్ ఎలాంటిదో ఈ సినిమా ద్వారా మరోసారి అందరికీ అర్థం అయ్యింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇటీవలే ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ చేయగా ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారిగా చిన్న నాటి తీపి గుర్తులను మళ్ళీ నెమరువేసుకున్నామని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఈటీవీ విన్ యాప్ కి ఈ సినిమాని అప్లోడ్ చేసిన తర్వాత మరో 1 మిలియన్ యూజర్లు అదనంగా వచ్చారట. అయితే ఈ సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకుందట. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తం సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి నిహారిక తో పాటుగా నాగబాబు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు. సుమారుగా 32 కేంద్రాలలో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. థియేటర్స్ లో పెద్ద సినిమాలు కూడా తిప్పి కొడితే నాలుగు వారాలు రన్ అవ్వలేని పరిస్థితులు ఉన్న రోజులివి.

    ఓటీటీ వచ్చిన తర్వాత థియేట్రికల్ రన్ ఆ స్థాయిలో పడిపోయింది. అలాంటిది ఒక్క చిన్న సినిమా ఈ స్థాయిలో థియేట్రికల్ రన్ ని రప్పించుకోవడం, ఓటీటీ లో విడుదలైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో లిమిటెడ్ షోస్ తో రన్ అవుతుండడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. నిర్మాతగా నిహారిక కొణిదెల కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది అనే చెప్పాలి. హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసిన ఈమెకు అనుకున్న స్థాయిలో సక్సెస్ లు రాలేదు. ఆ తర్వాత జీ5,హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్ లో వెబ్ సిరీస్ లను నిర్మించింది. అవి కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. భారీ నష్టాలు రావడం అప్పుల పాలైంది. అలాంటి సమయంలో ధైర్యం చేసి సినిమాని నిర్మించి గ్రాండ్ సక్సెస్ ని అందుకుంది, భవిష్యత్తులో ఆమె నిర్మాతగా ఇంకెన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి.