https://oktelugu.com/

ICC Rankings : అదిరిందయ్యా తిలక్.. వారెవ్వా వరుణ్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎక్కడికి దూసుకెళ్లారంటే!

సరైన వేదిక.. నిరూపించుకోవలసిన అవకాశం లభించాలే గాని క్రికెటర్లు ఎక్కడికో వెళ్లిపోతుంటారు. వారిలో ప్రతిభను నూటికి నూరు శాతం నిరూపించుకుంటూ.. జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తుంటారు. అంతేకాదు సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ ఉంటారు.

Written By: , Updated On : January 30, 2025 / 10:03 AM IST

varun tilak

Follow us on

ICC Rankings : ప్రస్తుతం టీమిండియాలో ఇద్దరికి యువ ఆటగాళ్లు చెలరేయి ఆడుతున్నారు. ఒకరేమో బంతితో మాయాజాలం సృష్టిస్తుండగా.. మరొకరేమో బ్యాట్ తో మైదానంలో తాండవం చేస్తున్నారు. వారిపేరే వరుణ్ చక్రవర్తి, తిలక్ వర్మ. వీరిద్దరూ ఐపీఎల్లో సత్తా చాటిన వారే. వారి జట్ల విజయాలలో కీలక పాత్ర పోషించినవారే. అందువల్లే వీరికి టి20 క్రికెట్లో అవకాశాలు త్వరగా వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పటికీ వీరిద్దరూ వాటిని సద్వినియోగం చేసుకున్నారు. వివిధ వేదికల వద్ద భారతదేశం తరఫున ఆడి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అటు బౌలింగ్, బ్యాటింగ్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. అందువల్లే నేడు వీరు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. ఐసీసీ టి20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో తిలక్ వర్మ ఏకంగా రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు సాల్ట్ ను మూడో స్థానానికి నెట్టేశాడు. 832 పాయింట్లతో రెండవ స్థానాన్ని ఆక్రమించాడు సాల్ట్ ఖాతాలో ఇస్తే 782 పాయింట్లు ఉన్నాయి. ఇక అగ్రస్థానంలో ట్రావిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఇతడి ఖాతాలో 855 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టుతో రెండవ టి20 మ్యాచ్లో ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. తిలక్ వర్మ ఒక్కడే అడ్డుగా నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టును ఓడించాడు. భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చెన్నై వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తిలక్ వర్మ 72 పరుగులతో ఆకట్టుకున్నాడు.

దూసుకెళ్లిన వరుణ్ చక్రవర్తి

ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ t20 ర్యాంకింగ్లో దూసుకెళ్లాడు. ఇంగ్లాండ్ జట్టుపై రాజ్ కోట్ వేదికగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అదరగొట్టాడు. అంతకుముందు అతడు దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఓ టీ 20 మ్యాచ్ లోను ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్లో ప్రత్యర్థి బ్యాటర్లను వరుణ్ చక్రవర్తి ముప్పు తిప్పలు పెడుతున్నాడు. 3 t20 లలో 7.8 ఎకానమీతో పది వికెట్లను పడగొట్టాడు. ఇక ప్రస్తుతం టి20 లలో 25 ర్యాంకులు పైకి చేరుకొని.. ఏకంగా ఐదవ స్థానాన్ని ఆక్రమించాడు. అంతేకాదు టీ20లలో కులదీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తర్వాత రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన మూడవ భారతీయ బౌలర్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. గత ఐపిఎల్ లో వరుణ్ చక్రవర్తి కోల్ కతా తరఫున ఆడాడు. ఆ జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం అదే అనుభవాన్ని ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ లోనూ ఉపయోగించుకుంటున్నాడు. సరైన లెంగ్త్ లైన్ లో బంతులు వేస్తూ ప్రత్యర్థి ప్లేయర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అటు వరుణ్ చక్రవర్తి, ఇటు తిలక్ వర్మ బంతి, బ్యాట్ తో అదరగొడుతున్న నేపథ్యంలో.. అనుమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. వీరిద్దరూ భవిష్యత్తు టీమ్ ఇండియా క్రికెట్ ను శాసిస్తారని జోస్యాలు వెల్లు వెత్తుతున్నాయి.