Tilak Varma
Tilak Varma: టీం ఇండియాలో ఉన్న యువ ప్లేయర్ తిలక్ వర్మ .. నిన్న మొన్నటి వరకు పెద్దగా పరిచయం లేని ఈ పేరు ఇప్పుడు క్రికెట్ అభిమానుల అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది. టీ20 ఫార్మాట్ లోని హాఫ్ సెంచరీ నమోదు చేసిన రెండవ అత్యంత పిన్న వయసుకుడిగా తిలక్ వర్మ గుర్తింపు పొందాడు. వెస్టిండీస్ లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో తన ఇంటర్నేషనల్ పరుగుల ఖాతాను ఓపెన్ చేసిన ఈ తెలుగు తేజం తర్వాత జరిగిన రెండవ మ్యాచ్ లో కూడా ఇరగదీసే పెర్ఫార్మెన్స్ చూపించాడు.
41 బంతులలో 51 పరుగులు సాధించి మెరుపు వేగంతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 ఏళ్ల 143 రోజుల వయసులో టీ 20 లో తన మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇప్పుడు తిరిగి తిలక్ వర్మ 20 ఏళ్ల 271 రోజుల వయసులో తన తొలి టీ20 హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ రికార్డుతో అతను అత్యంత తిన్నవయసులో టీ20 లో హాఫ్ సెంచరీ సాధించిన ఇండియన్ ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానానికి అర్హుడయ్యాడు.
రిషభ్ పంత్ తన తొలి టీ 20 హాఫ్ సెంచరీని 21 ఏళ్ల 38 రోజులు వయసులో సాధించి మూడవ స్థానంలో,రాబిన్ ఉతప్ప 21 ఏళ్ల 307 రోజులు వయసులో నాలుగవ స్థానంలో,సురేశ్ రైనా 22 ఏళ్ల 90 రోజులు వయసులో సాధించి 5వ స్థానంలో కొనసాగుతున్నారు. తిలక్ వర్మ నెలకొల్పిన ఈ సరికొత్త రికార్డుతో యావత్ క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం అతనిపై కేంద్రీకృతమై ఉంది. అంతేకాకుండా ఎవరీ తిలక్ వర్మ అని ఎంతోమంది నటిజన్స్ ఆన్లైన్లో సర్చ్ కూడా చేస్తున్నారు.
విదేశీ గడ్డపై అరంగేట్రం చేసిన టి20 మ్యాచ్ లో అత్యధికంగా సిక్సులు స్ట్రైక్ చేసిన భారత్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ బ్యాటింగ్ ఈసారి కూడా అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. తొలుత బ్యాటింగ్ చేపట్టి చెలరేగి ఆడతారు అనుకున్న వాళ్లు కాస్త 152 పరుగులతో సరిపెట్టుకున్నారు. భారత్ లాంటి జట్టుకు ఇది ఎంతో స్వల్పమైన స్కోర్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో తెలుగు తేజం తిలక్ వర్మా మినహా ఇంక ఎవ్వరు అర్థ శతకం దాటింది లేదు. టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా 24 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా 27 పరుగుల వద్ద చేతులెత్తేసాడు..శుభ్‌మన్ గిల్,సంజూ శాంసన్ సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితం అయితే సూర్య కుమార్ యాదవ్ ఒక్క రన్ తో పెవీలియన్ తిరుగు ముఖం పట్టాడు.
తరువాత లక్ష్యసాధనకు దిగిన వెస్టిండీస్ అచ్చిరాదు అనుకున్న స్టేడియంలో చెలరేగి ఆడారు. 18.5 ఓవర్లకే 155 పరుగులు సాధించి భారత్ ను చిత్తుగా ఓడించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాల కారణంగానే గెలవవలసిన రెండవ మ్యాచ్ ని కూడా టీమిండియా వదులుకోవలసి వచ్చింది. సరియైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో తట పటాయించిన హార్దిక్ కారణంగానే వెస్టిండీస్ ఈరోజు గెలుపు సంబరాలు జరుపుకుంటుంది. 18వ ఓవర్ బౌలింగ్ చాహల్ కు అప్పగించి 19వ ఓవర్ అర్షదీప్ సింగ్ కు ఇచ్చి ఉంటే గెలుపు భారత్ పక్షాన ఉండే అవకాశం వుండేది.
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Read MoreWeb Title: Tilak verma scores a half century in the second t20 match between india vs west indies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com