Homeక్రీడలుTilak Varma: వన్డే ప్రపంచకప్ రేసులోకి మనోడు.. తిలక్ కు కలిసివచ్చే అంశాలివే...

Tilak Varma: వన్డే ప్రపంచకప్ రేసులోకి మనోడు.. తిలక్ కు కలిసివచ్చే అంశాలివే…

Tilak Varma: వన్డే ప్రపంచ కప్ మొదలు కావడానికి రెండు నెలల సమయం మాత్రమే ఉంది. పైగా ఈసారి ఆతిథ్యం ఇస్తున్నది భారత్ కనుక మన జట్టుపై క్రికెట్ అభిమానులకు ఎన్నో ఆశలు నెలకొని ఉన్నాయి. కప్పు సాధించడమే దిశగా అడుగులు వేస్తున్న టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ కి ఆడబోయే జట్టుపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో హైదరాబాది క్రికెట్ ప్లేయర్ సెలెక్టర్ల దృష్టి తన వైపుకు ఆకర్షిస్తున్నాడు.

ఇప్పటికే మ్యాచ్లో ఆడాల్సిన ప్లేయర్ల గురించి సెలెక్టర్లకు మరియు టీం మేనేజ్మెంట్ కి చాలా వరకు స్పష్టత ఉండి ఉంటుంది. ఒక 20 ఏళ్ల కుర్రాడు…వారం క్రితం ఇంటర్నేషనల్ మ్యాచ్ మొదలు పెట్టినవాడు.. ఆడినవి కేవలం మూడు మ్యాచ్లు ,టెస్ట్ సిరీస్ అయినప్పటికీ…సెలెక్టర్ల ఆలోచనపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాడు. ప్రస్తుతం అతనికి క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఆదరణ అతన్ని ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పిస్తుంది అని అందరూ భావిస్తున్నారు.

తిలక్ గురించి మాట్లాడాలి అంటే కేవలం అతను సాధించిన గణాంకాల గురించి చర్చించుకుంటే సరిపోదు. ఎన్నో సందర్భాలలో టీంలోని ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ సైతం చేతులెత్తేస్తే…నిలబడి ఆడిన వాడు తిలక్. తీవ్రమైన ఒత్తిడికి గురి చేసే సందర్భాలలో కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ బాల్స్ ను గీటుగా ఎదుర్కొని బౌండరీ వైపు పరిగెత్తించాడు. చిన్న వయసులోనే అత్యంత ప్రతిభ కనబరుస్తున్న ఈ ఆటగాడికి ఎంతో భవిష్యత్తు ఉందని క్రికెట్ విశ్లేషకులు కీర్తిస్తున్నారు.

మరి ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన మూడు టి20 మ్యాచ్లలో , సీనియర్ ఆర్డర్ తడబడ్డ నిలకడగా మంచి ప్రదర్శన కనబరిచి తిలక్ అందరి దృష్టిని తన వైపు ఆకర్షించాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా ఆడి మూడు మ్యాచ్లలో 39,51,49 స్కోర్స్ సాధించాడు.
ఇంత చిన్న వయసులో అతను చూపిస్తున్న పరిణితి అందరిని అబ్బురపరుస్తుంది. ఇండియన్ ఫార్మాట్లో దీర్ఘకాలం మంచి ప్లేయర్గా రాణించగలిగే సత్తా తిలక్వర్మలో ఉంది అని అందరూ ప్రశంసిస్తున్నారు.

టీమిండియా కు క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు… కపిల్ దేవ్, సచిన్, ధోని, కోహ్లీ…ఇలా కొందరి పేర్లు మాత్రమే టక్కున గుర్తుకు వస్తాయి. తిలక్ వర్మ ఈ జాబితాలో చేరదగ్గ పేరు అని అభిమానులు భావిస్తున్నారు. గత కొద్ది కాలంగా భారత జట్టు మిడిల్ ఆర్డర్ తడబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియార్టీ కన్నా సిన్సియారిటీ ఎంతో ముఖ్యం.. కాబట్టి ప్రస్తుతం జట్టుకు తిలక్ వర్మ లాంటి ఆటగాళ్ల అవసరం ఎంతో ఉంది.

తిలక్ వెస్టిండీస్ తో ఆడుతున్న మ్యాచ్లో తన సత్తాను అన్ని రకాలుగా చాటి చెప్పాడు. బ్యాటింగ్ పరంగా అతను ఎంత ఒత్తిడిలో అయినా నిలకడగా ఆడగలడు అని నిరూపించుకున్నాడు. ప్రపంచ కప్ కి వెళ్లవలసిన టీమ్ లో ఆటగాడికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఒత్తిడిని తట్టుకోవడం. పైగా ఇషాన్ కిషన్ పక్కన పెడితే టీమ్ ఇండియాలో ఎడమ చేతి బ్యాటర్స్ లేరు. ఎడమ చేతి వాటం ఉన్న బెటర్ కావడం తిలక్‌కు మరొక ప్లస్ పాయింట్. ఇలా అన్ని కలిసివచ్చే అంశాలు ఉండడంతో కచ్చితంగా తిలక్ వన్డే ప్రపంచ కప్ టీం లో ఉండే అవకాశం ఉండొచ్చు.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Exit mobile version