IPL 2026: రోజులు మొత్తం ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు మనకు అనుకూలంగా.. మరి కొన్నిసార్లు మనకు ప్రతికూలంగా సాగిపోతూ ఉంటాయి. అనుకూలంగా ఉన్నప్పుడు ఇబ్బందులు కలగవు. ప్రతికూలంగా ఉన్నప్పుడే అవరోధాలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ఈ జట్లకు ఎదురైంది. అది కాస్త ప్రస్తుత ఐపీఎల్ లో చర్చకు దారి తీస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు జట్లు ఐపీఎల్లో ఏకంగా చెరి ఐదు సార్లు విజేతలుగా నిలిచాయి. కొంతకాలంగా ఈ రెండు జట్ల పరిస్థితి అంత గొప్పగా లేదు. వాస్తవానికి ఐపీఎల్లో ఈ రెండు జట్లు సాగించిన పెత్తనం.. ఏకపక్ష విజయాల శాతం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఈ రెండు జట్లలో అద్భుతమైన ప్లేయర్లు ఉండేవారు. మైదానంలోకి దిగితే చాలు విధ్వంసానికి పరాకాష్టగా ఆడేవారు. చెన్నై ప్రస్తుత ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. ఆరు మ్యాచులలో రెండిట్లో మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్లు ఆడి.. ఒకదాంట్లో మాత్రమే విజయ సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆరు మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు ఓటములు ఉన్నాయి. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఫలితంగా కోల్ కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అధమ స్థానంలో ఉంది.
గతంలో ఘనంగా ఆడిన ఈ రెండు జట్ల ఆటగాళ్లు.. ఇప్పుడు మాత్రం అధ్వానమైన ఆట తీరు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఈ రెండు జట్లు కొంతకాలంగా దారుణమైన ఆట తీరు కొనసాగిస్తున్నాయి. ముంబై, చెన్నై పరిస్థితి అలా ఉంటే.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పరిస్థితి మరోరకమైనది. కోల్ కతా 2024 లో ఛాంపియన్ అయింది. 2025లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సీజన్లో మాత్రం అట్టడుగు స్థానంలో ఉంది.. కోల్ కతా నైట్ రైడర్స్ ఇలా ఆడటం ఆ జట్టు అభిమానులకు ఆనందం కలిగించడం లేదు. ఆడటం.. ఓడిపోవడం వంటివి కోల్ కతా పరిపాటి గా మార్చుకుంది. దీంతో ఆ జట్టులో ప్రక్షాళన అవసరమని అభిమానులు భావిస్తున్నారు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ వరుసగా విజయాలు సాధించాల్సి ఉంది. అలా ఆడితేనే ఈ మూడు జట్లు ప్లే ఆఫ్ దాకా వెళ్తాయి. లేకపోతే గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోవడం.. బౌలింగ్ అధ్వానంగా ఉండడం.. ఫీల్డింగ్ ఏ మాత్రం బాగో లేకపోవడం వల్ల ఈ మూడు జట్లు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అందువల్లే ఐపిఎల్ లో ఇలా ఓటములు చవిచూస్తున్నాయి. సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇలా ఆడతారని తాము ఊహించలేదని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.