India Vs Australia Final 2023: ఇండియన్ టీం బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు ముందుకు కదులుతుంది. ఇక ఇప్పటివరకు ఏ వరల్డ్ కప్ లో కూడా ఇండియన్ టీం ఇంత చక్కటి పర్ఫామెన్స్ ని కనబరిచలేదు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. టీమ్ లో ఉన్న 11 మంది ప్లేయర్లు 11 బుల్లెట్ల లా దూసుకుపోతూ ప్రత్యర్థి ప్లేయర్ల మీద విరుచుకుపడి ఆడుతున్నారు. ఇక బౌలర్లు అయితే బాల్ ని వికెట్లు తీయడానికి విసురుతున్నారు అనేంత రేంజ్ లో వికెట్లను తీస్తూ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే లీగ్ దశలో ఇండియా వరుసగా తొమ్మిది విజయాలను అందుకొని నెంబర్ వన్ పొజిషన్ లో నిలబడమే కాకుండా అందరికంటే ముందే సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్న మొదటి టీం గా ఇండియా ఈ టోర్నీలో నిలవడం ఇండియన్ టీమ్ కి గర్వకారణం అనే చెప్పాలి. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీం పైన ఘన విజయాన్ని దక్కించుకొని ఇక ప్రపంచం లో ఇండియాకు తిరుగులేదు అనేంత రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది…
ఇక ఫైనల్ రేస్ లో ఆస్ట్రేలియాని చిత్తు చేసి కప్పు కొట్టడానికి ఇండియన్ ప్లేయర్లు వారియర్స్ లో ఎదురుచూస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఇండియన్ ప్లేయర్లు ఈ మ్యాచ్ లో కూడా అదే దూకుడును ప్రదర్శించి ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించి 2003 నాటి రివెంజ్ ను తీర్చుకుంటూనే ఇండియాకి మూడోసారి వరల్డ్ కప్ అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు..ఇక విల్లు నుంచి వదిలిన బాణంలా టార్గెట్ ని చేరుకోవడమే లక్ష్యం గా ముందుకు దూసుకెళ్తున్నారు…
ఇక ఇండియన్ టీం సక్సెస్ లో ప్రతి ప్లేయర్ కూడా కీలక పాత్ర వహిస్తున్నాడు. ముఖ్యంగా టాపార్దర్ లో శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తున్నారు. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే మొదటి ఓవర్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేస్తూ వరుసగా ఫోర్లు, సిక్స్ లు కోడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెడుతున్నాడు పవర్ ప్లే లోని ఆయన పెడుతూ తను కొట్టల్సినా స్కోర్ కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు సెహ్వాగ్ ఎలా ఆడేవాడో, ఇప్పుడు రోహిత్ శర్మని చూస్తే అలానే అనిపిస్తుంది. ఇక మరో ఓపెనర్ అయిన శుభ్ మన్ గిల్ ఆచితూచి నిదానంగా ఆడుతూ స్కోర్ ని చాలావరకు ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక వీళ్లు ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ కొన్ని మ్యాచ్ ల్లో టాపార్డర్ విఫలమైనప్పుడు భారం మొత్తం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ మోయాల్సి ఉంటుంది. ఇక మన మిడిల్ ఆర్డర్ ప్లేయర్లలో నెంబర్ ఫోర్ ,నెంబర్ ఫైవ్ లో శ్రేయస్ అయ్యర్ , కేల్ రాహుల్ ఇద్దరూ కూడా అద్భుతమైన ప్రదర్శనని కనబరుస్తున్నారు. నిజానికి వరల్డ్ కప్ కి ముందు వీళ్ళిద్దరూ కూడా గాయాల కారణంగా ఇండియన్ టీం కి దూరమయ్యారు అయిన కూడా వరల్డ్ కప్ కి ముందే ఫిట్ గా మారి వరల్డ్ కప్ లో ఎంట్రీ ఇచ్చి అవకాశం వచ్చిన ప్రతి మ్యాచ్ లో కూడా తమదైన ఇన్నింగ్స్ ఆడుతూ ఇండియా విన్ అవడంలో తమ వంతు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ 2 సెంచరీలు చేయగా, కేఎల్ రాహుల్ ఒక సెంచరీ చేశాడు అలాగే ఆస్ట్రేలియా మీద ఆడిన మొదటి మ్యాచ్ లో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక దాంతో టీం ఇండియా ఘన విజయం సాధించింది…
ఇక ప్రస్తుతానికి వీళ్ళిద్దరే మిడిల్ ఆర్డర్ భారం మొత్తాన్ని మోస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చి ఇటు టాపార్డర్ కి,అటు మిడిల్ ఆర్డర్ కి మధ్యలో తన ఒక గోడలాగా నిలబడిపోయి ఇటు ఓపెనర్ ప్లేయర్ తోను, అటు మిడిల్ ఆర్డర్ ప్లేయర్ తోను మంచి పత్నార్ షిప్ నెలకొల్పుతూ టీం భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.ఇక ఇప్పటికే మూడు సెంచరీలను పూర్తి చేసుకొని, వన్డేల్లో 50 వ సెంచరీ ని నమోదు చేసుకున్నాడు ఇక టోర్నీ లో ఎవ్వరికీ సాధ్యం కానీ రేంజ్ లో 10 ఇన్నింగ్స్ లల్లోనే 711 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ ఫైనల్ లో కూడా మరో సెంచరీని నమోదు చేస్తాడనే ఆశాభావాన్ని ఫాన్స్ అందరు వ్యక్తం చేస్తున్నారు…
ఇక బ్యాట్స్ మెన్స్ తో పాటు బౌలర్లు కూడా తమదైన రీతిలో బౌలింగ్ చేస్తూ ఇండియన్ టీం విజయంలో కీలకపాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి మ్యాచ్ లో కూడా సాధ్యమైనంత వరకు ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేసి చాలా సార్లు సక్సెస్ కూడా అయ్యారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీమ్ బౌలర్లు ప్రతి మ్యాచ్ లో కూడా నిప్పులు చెరిగే స్పెల్ వేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తున్నారు. ఇక ముఖ్యంగా శమీ అయితే 6 మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు తీసి ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డు ని నెలకొల్పాడు. ఇక ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఒక ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు…
ఇక ఫైనల్ మ్యాచ్ లో కూడా అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియా ని ఓడించి మూడోసారి వరల్డ్ కప్ ను అందుకునే ప్రయత్నంలో టీం మొత్తం చాలా ఆసక్తితో ఉంది…