Odi World Cup 2023: వరల్డ్ కప్ 2023 లో భాగంగా ప్రస్తుతం ఇండియన్ టీం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తలపడడానికి సిద్ధంగా ఉంది. ఇక అందులో భాగంగానే ఈ టోర్నీలో ఇండియన్ టీమ్ మొదటి నుంచి వరుస విజయాలను అందుకుంటూ ఫైనల్ కి చేరుకుంది. ఇక ఫైనల్ లో కూడా తన మార్కు చూపిస్తూ ఆస్ట్రేలియా మీద ఘన విజయం సాధించడానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డు ఎవరిని వరించబోతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
విరాట్ కోహ్లీ…
విరాట్ కోహ్లీ అత్యుత్తమమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ ఈ టోర్నీలో తన 50 వ పూర్తిచేసుకొని సచిన్ టెండుల్కర్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేశాడు. ఇక ఇప్పటికే మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు చేసి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.ఇక వరల్డ్ కప్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ 711 పరుగులు చేసి ఒక టోర్నీ లో 711 పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా కోహ్లీ వరల్డ్ రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఫైనల్లో కూడా సెంచరీ చేస్తాడేమో చూడాలి…
ఆడమ్ జంపా
ఆడమ్ జంపా ఆస్ట్రేలియా టీమ్ తరుపున అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ఇప్పటికే 22 వికెట్లు తీశాడు.ఇక ఫైనల్ మ్యాచ్ లో ఎంత మేరకు ఈయన మ్యాజిక్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…4 సార్లు మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు అద్భుతమైన విజయాలను అందించాడు…
క్వింటన్ డికాక్…
ఈయన ఈ టోర్నీ లో నాలుగు సెంచరీ లు చేసి 594 పరుగులు చేశాడు.ఇక సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా మీద సౌతాఫ్రికా టీమ్ ఓడిపోవడం తో సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక డికాక్ కూడా ఈ ప్రపంచకప్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు…
మహ్మద్ షమి..
ఈయన టోర్నీ మధ్యలో టీమ్ లోకి వచ్చి ఆడిన మొదటి మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసి అందరి దృష్టి ని ఆకర్షించాడు..ఇక కేవలం 6 ఇన్నింగ్స్ లోనే 23 వికెట్లు తీసి ఇప్పటి వరకు ఇండియన్ పేసర్లకి ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో బౌలింగ్ చేశాడు…ఇక న్యూజిలాండ్‌పై 5/54, ఇంగ్లాండ్‌పై 4/22, శ్రీలంకపై 5/18 వికెట్లు తీశాడు. ఇక న్యూజిలాండ్ పైన సెమీ ఫైనల్ లో 7 వికెట్లు తీసి ఒక అద్భుతమైన విజయాన్ని ఇండియన్ టీమ్ కి అందించాడు…ఇక ఫైనల్ లో ఏ మేరకు వికెట్లు పడగొడుతాడో చూడాలి…
ముఖ్యంగా వీళ్ళ నలుగురి మధ్య ఎవరు ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ ని దక్కించుకుంటారు అనేది ఇప్పుడు కీలకం గా మారింది…