Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ పదకొండవ వారంలో హౌస్ మేట్స్ చేసిన రచ్చ అంత ఇంత కాదు. వాళ్ళ ప్రవర్తన చూసి ఆడియన్స్ కూడా వీకెండ్ ఎపిసోడ్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. నాగార్జున ఎప్పుడొచ్చి వాళ్ళ పని పడతాడా అనే ఉత్కంఠ నెలకొంది. శనివారం ఎపిసోడ్లో నాగార్జున కంటెస్టెంట్స్ కి వరుసగా ఇచ్చి పడేసాడు. ఇక గత వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ని గుర్తు చేస్తూ సీసా తలపై కొట్టి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటూ నాగార్జున చెప్పారు.
కెప్టెన్ అయిన ప్రియాంకను నాగార్జున అభినందించాడు. అనంతరం శివాజీకి భారీ క్లాస్ పీకాడు. ‘శివాజీ .. నాకు కొన్ని .. చాలా సమస్యలు ఉన్నాయయ్యా’ అప్పుడప్పుడు వచ్చే బూతులా అండి అంటూ శివాజీ వినయంగా అడిగాడు. దీంతో నాగార్జున ‘ ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది .. నీ సహనం ఏమైంది.. ఈ విషయంలో నీ సమర్ధత ఏది అంటూ నిలదీశారు. ‘ ఎర్రి పోహా .. పిచ్చి పోహా ‘ ఇవి హౌస్ లో వాడే పాదాల శివాజీ అంటూ ఇచ్చి పడేశాడు. ఆ తర్వాత రతిక తో ‘ నేను ఈ హౌస్ లో కొన్ని పదాలను బ్యాన్ చేస్తున్న .. వచ్చే వారం నుంచి నేనేంటో చూపిస్తాను .. నేను ఇప్పుడు నుంచి ఆడతాను ఈ రెండు సెంటెన్స్ లు బ్యాన్ చేస్తున్న అంటూ రతిక ఫోటో పై నాగార్జున బాటిల్ పగలగొట్టాడు.
తర్వాత ‘ అమర్ నేను విన్నర్ అని నువ్వు అనుకోకపోతే నువ్వు విన్నర్ ఎలా అవుతావు’ అని అమర్ కి చెప్పారు నాగ్. ‘ చెల్లెల్ని గెలిపించుకోవడం తప్ప నువ్వు ఏమైనా చేశావా అని గౌతమ్ కి క్లాస్ పీకాడు. అసలు ఈ వారం నువ్వు ఎం ఆడావు ప్రశాంత్ .. ఫ్యామిలీ వీక్ లో అందరూ వచ్చి నీ పేరు పెట్టారు కదా అని .. రిలాక్స్ అయిపోయావా.
లేదంటే ఎవరికైనా అవకాశాలు ఇద్దామని అనుకున్నావా అని అనడంతో .. ప్రశాంత్ నోట మాట రాలేదు. చివరిగా అశ్విని కి సీసా చేతిపై పగలగొట్టుకుని చూపించాడు నాగార్జున. ‘ నామినేషన్స్ ప్రియాంక సీసా పగల కొట్టినప్పుడు ఏదో తల పగిలిపోయినట్టు అంతలా చేశావ్ .. బిగ్ బాస్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోడా అని నాగార్జున అన్నారు. దీనికి ‘ ఆ బాటిల్ లో ఏదో తేడా ఉందేమో సార్ .. నాకు తెలియదు అంటూ అశ్విని విచిత్రమైన సమాధానం చెప్పింది. దీంతో నాగ్ తెగ నవ్వేసాడు.
ఇక అవిక్షన్ పాస్ ఎవరికీ దక్కలేదు. యావర్ గెలుచుకున్నప్పటికీ గేమ్స్ ఫెయిర్ గా ఆడలేదని రుజువైంది. నేను సరిగా ఆడకపోతే నాకు అవిక్షన్ పాస్ వద్దని నాగార్జునతో యావర్ అన్నాడు. యావర్ ఇష్టప్రకారం నాగార్జున అవిక్షన్ పాస్ తిరిగి తీసేసుకున్నాడు. రతికపై పల్లవి ప్రశాంత్ చెప్పిన కవితతో శనివారం ఎపిసోడ్ ముగిసింది…