India Vs Afghanistan: వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీ వేదికగా ఇవాళ్ల ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ టీమ్ ల మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ ఆఫ్గనిస్తాన్ టీమ్ ని కూడా మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆఫ్గనిస్తాన్ టీమ్ లో కూడా మ్యాచ్ విన్నర్లు చాలామంది ఉన్నారు. నిజానికి వాళ్లు లాస్ట్ టైం వరల్డ్ కప్ లో మన టీమ్ ని 250 రన్స్ కూడా చేయకుండా కట్టడి చేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది…ఇక ఇండియన్ టీం కూడా ఇప్పటివరకు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది.వరుస విజయాలను సాధిస్తూ వరుసగా ముందుకు దూసుకెళ్తుంది.ఈ టైంలో ఆఫ్గనిస్తాన్ టీం ఎంత వరకు ఇండియా టీమ్ కి పోటీ ఇస్తుంది అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. ఒకసారి ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా అరుణ్ జైట్లీ స్టేడియం గురించి కనక తెలుసుకున్నట్లైతే ఈ పిచ్ ఐపీఎల్ లో ఆడినప్పుడు ఎక్కువగా స్పిన్ కి అనుకూలించే పిచ్ గా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో దీన్ని రిమాడిఫై చేయడం జరిగింది. అందువల్ల ఈ పిచ్ ఇప్పుడు బ్యాటింగ్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది. అందుకే మొన్న జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద అనేది పారింది…శ్రీలంక సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ని కనుక చూసుకుంటే మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా టీమ్ ఏకంగా 428 రన్స్ చేసింది. అలాగే చేజింగ్ కి వచ్చిన శ్రీలంక టీమ్ 326 స్కోరు చేయగలిగింది. అంటే ఇక్కడ రెండు టీములు కూడా హై స్కోర్ చేశాయి దాంతో ఈ పిచ్ లో ఒక హై స్కోర్ గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది అనేది ఆ మ్యాచ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది.ఇక ముఖ్యంగా ఈ పిచ్ అనేది స్పిన్ కి అనుకూలించే ట్రాక్ అయితే ఇక్కడ ఈజీగా వికెట్లు పడిపోతాయి అదే విధంగా గా ఒక లో స్కోరింగ్ గేమ్ గా సాగుతుంది.
ఈ పిచ్ అనేది ఫ్లాట్ ట్రాక్ మీద ఉన్నట్లయితే చాలా ఎక్కువ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లను బట్టి చూస్తే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపించింది.కానీ ఈ పిచ్ ఇవాళ్టి మ్యాచ్ లో ఎవరికి అనుకూలిస్తుందో తెలీదు కాబట్టి ఈ మ్యాచ్ ఏ విధంగా మారుతుంది అనేది చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇక ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో మొత్తం 26 మ్యాచ్ లు ఆడితే అందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీం 13 మ్యాచ్ ల్లో గెలిచింది, రెండో బ్యాటింగ్ చేసిన టీం 13 మ్యాచ్ ల్లో గెలిచింది.ఇక యావరేజ్ స్కోరు వచ్చేసి 237 గా ఉంది…కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన చేజ్ చేసిన పెద్దగా నష్టం అయితే ఉండదు…
ఇక ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు జరిగితే అందులో రెండు మ్యాచ్ ల్లో ఇండియా గెలిచింది ఒక మ్యాచ్ టై అయింది. అంటే ఇప్పటివరకు ఆఫ్గనిస్తాన్ ఇండియా టీం ని ఒక్కసారి కూడా ఓడించలేదు. ఇక ఈ పిచ్ లో ఈ రెండు టీములు తలపడడం ఇదే మొదటిసారి ఇక ఈ పిచ్ లో ఇండియా టీం ఇప్పటివరకు మొత్తం 20 మ్యాచ్ లు ఆడితే అందులో 13 మ్యాచ్ లు గెలిచింది. ఏడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది అంటే స్టాట్స్ ప్రకారం చూసుకున్న, విన్నింగ్ ప్రకారం చూసుకున్న ఇది ఇండియా టీం కి ఎక్కువగా కలిసి వస్తుందనే చెప్పాలి.
అలాగని ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లని మనం తక్కువ అంచన వేయడానికి వీల్లేదు ఎందుకంటే ఆ టీమ్ లో చాలామంది మ్యాచ్ విన్నర్లు లో ఉన్నారు.ముఖ్యంగా రషీద్ ఖాన్ తన స్పిన్ తో మ్యాజిక్ చేయగలడు, అలాగే బ్యాటింగ్ లో కూడా తన సత్తా చూపించగలడు ఇక మహమ్మద్ నబీ ఆల్ రౌండర్ ప్రదర్శన ఇస్తూ ఆ టీమ్ కి గొప్ప విజయాలను అందించిన మ్యాచులు కూడా ఉన్నాయి. రహమానుల్ల గురుబాజ్ ఈయన కూడా చాలా సెన్సిటివ్ బ్యాటింగ్ తో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేయగలరు ఇక ఐపీఎల్ లో మంచి బౌలింగ్ చేసిన నవీన్ ఉల్ హక్ కూడా టీంలో ఉండడం ఆ టీమ్ కి ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే ముజుబుర్ రహమాన్ లాంటి ప్లేయర్లు కూడా ఈ టీం కి అదనపు బలంగా చెప్పవచ్చు…
ఇక అసలు విషయానికి వస్తే ఆల్రెడీ ఆస్ట్రేలియా మీద ఒక మ్యాచ్ గెలిచి మన టీమ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో మన టీమ్ ఈ మ్యాచ్ గెలవడం కష్టమైతే కాదు కానీ కొంచం జాగ్రత్త గా ఆడితే బెటర్.ఇక మన టీం లో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉండడంవల్ల ఈ మ్యాచ్ ని ఈజీగా మనం గెలవచ్చు…
ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కొంత వరకు వాళ్ల స్పిన్ బౌలింగ్ తో మన బ్యాట్స్ మెన్స్ ని ఇబ్బంది పెడుతుంది కానీ వాళ్ల దగ్గర సరైన పేస్ బౌలింగ్ అయితే లేదు పేస్ బౌలింగ్ లో మనవాళ్లు చెలరేగిపోయి ఆడతారు. ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ తో ఆడిన మొదటి మ్యాచ్ ఒక లో స్కోరింగ్ గేమ్ గా నడిచింది. ఎక్కువ రన్స్ చేయడంలో వీళ్లు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. దానివల్ల బంగ్లాదేశ్ ఈజీగా ఆఫ్గనిస్తాన్ మీద చేజ్ చేసింది.ఇక వీళ్ళ కి ఈ వరల్డ్ కప్ లో ఆశించిన శుభారంభం అయితే రాలేదు. కాబట్టి ఇండియా టీం మీద వీళ్ళు ఎంతవరకు మ్యాజిక్ చేయగలరనేది చూడాలి…
అవిగనిస్తాన్ టీం బౌలింగ్ లో కొద్ది వరకు బాగున్నప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం మన బౌలర్లను ఎదుర్కొని నిలబడాలంటే చాలా కష్టం ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా లాంటి ఒక బలమైన బ్యాట్స్ మెన్స్ ఉన్న ఒక పెద్ద టీమ్ నే మనవాళ్ళు 200 స్కోర్ కొట్టకుండా కట్టడి చేశారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ టీం మన మీద ఎక్కువ స్కోర్ అయితే చేయలేదు…. ఈ మ్యాచ్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్ లో మొదటి విజయం నమోదు చేయాలని చూస్తుంటే, ఇండియా మాత్రమే ఈ మ్యాచ్ గెలిచి వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది… ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ముగ్గురిలో ఎవరో ఒకరు సెంచరీ చేసే అవకాశం అయితే ఉంది…అలాగే బౌలింగ్ మళ్ళీ రవీంద్ర జడేజా కీలకం గా మారబోతున్నాడు…