Sunrisers Hyderabad Team: ఈనెల 22వ తేదీ నుంచి ఐపిఎల్ సీజన్ 17 స్టార్ట్ అవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు కూడా తీవ్రమైన కసరత్తులను చేస్తూ ఎవరికి వారు ఆ టీంలో ఉన్న ప్లేయర్ల యొక్క ప్లేయింగ్ 11 ను సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు సరికొత్త మార్పులతో బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ని కూడా మార్చింది. గత సీజన్ లో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అయిన ఐడేన్ మర్కారం హైదరాబాద్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించగా, ఇప్పుడు ఆయన్ని తప్పిస్తూ ఆస్ట్రేలియన్ టీమ్ కెప్టెన్ అయిన పాట్ కమ్మిన్స్ ను జట్టు భాద్యతలను అప్పగించారు. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన మినీ ఆక్షన్ లో 20.5 కోట్ల చెల్లించి మరి కమ్మిన్స్ ను టీమ్ లోకి తీసుకున్నారు. ఇక అన్ని కోట్లు పెట్టీ ఆయన్ని తీసుకోవడం వెనక ముఖ్య కారణం ఏంటి అంటే గత సంవత్సరం ఆస్ట్రేలియా టీమ్ వరల్డ్ కప్ గెలవడంలో కెప్టెన్ గా కమ్మిన్స్ కీలక పాత్ర పోషించాడు. అందువల్లే ఆయన్ని ఆ టీంలోకి తీసుకొని ఆయనకి కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన కోసం భారీగా డబ్బులను వెచ్చించి, మరి అతన్ని కొనుగోలు చేసింది… ఇక ఇప్పుడు కమ్మిన్స్ హైదరాబాద్ టీమ్ కి ఐపీఎల్ కప్పు ను అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ టీం లో ఓపెనింగ్ ప్లేయర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లు బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది. ఇక నెంబర్ త్రీ లో మయాక్ అగర్వాల్ గానీ, రాహుల్ త్రిపాఠి గాని టీం లోకి వచ్చే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా అగర్వాల్ కంటే రాహుల్ త్రిపాఠిని టీమ్ లోకి సిచువేశన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే త్రిపాఠి ఎలాంటి టైం లో అయిన బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ అందుకే అతన్ని టీం లోకి తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి… ఇక నెంబర్ ఫోర్ లో హెన్రిచ్ క్లాసెన్ ఇక నెంబర్ ఫైవ్ లో షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాజ్, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్ల మధ్య విపరీతమైన పోటీ అయితే ఉంది. ఇక టీం బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లో స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మార్కరం ను కూడా పక్కనపెట్టి శ్రీలంక ఆల్ రౌండర్ ప్లేయర్ అయిన హస్రంగ ను టీమ్ లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి…
ఎస్ ఆర్ ఎచ్ టీం ప్లేయింగ్ లెవెన్ ని కనక మనం ఒకసారి చూసుకున్నట్లైతే ట్రావెల్స్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హెన్రీచ్ క్లాసన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమాజ్, పాట్ కమ్మిన్స్, వనిందు హసరంగ, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మాయంక్ మర్కండే…ఇంపాక్ట్ ప్లేయర్ గా నటరాజన్ ఆడే అవకాశాలు ఉన్నాయి…