India Team: 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియన్ టీం ఆస్ట్రేలియా మీద ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఇక దాంతో మన ప్లేయర్ల తో పాటు, అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురి అయ్యారు. ఇక ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన 5 మ్యాచ్ ల టి 20 సీరీస్ లో 4-1 తేడా తో ఇండియా ఆస్ట్రేలియా ని చిత్తు గా ఓడించి సీరీస్ ని కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు సౌతాఫ్రికా తో టెస్ట్, వన్డే, టి20 సిరీస్ లు ఆడటానికి ఇండియన్ టీం రెడీ అవుతుంది.
అయితే టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించగా, వన్డే సిరీస్ కి కేఎల్ రాహుల్, టి 20 లకి సూర్య కుమార్ యాదవ్ లను కెప్టెన్లు గా బిసిసిఐ నిర్ణయించింది. అయితే టెస్టుల్లో అత్యుత్తమమైన ప్రదర్శనను కనబరిచే పుజారా,అజెంకే రహానే లాంటి ఇద్దరు దిగ్గజ ప్లేయర్లకు ఈ టెస్ట్ సీరీస్ లో చోటు కల్పించక పోవడం ఏంటి అంటూ ఇప్పుడు చాలా పెద్ద చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ టెస్ట్ టీం లో చాలా అద్భుతమైన ప్రదర్శనని కనబరుస్తూ వస్తున్నారు. అయితే వీళ్ళిద్దరిని ఒకేసారి పక్కన పెట్టడం వెనక ఏదైనా కుట్రలు జరుగుతున్నాయా అంటూ క్రికెట్ అభిమానులు సైతం బీసీసీఐ ని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఒక రహానే తప్ప మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఆయన ఒక్కడు మాత్రమే రెండు ఇన్నింగ్స్ లలో అద్భుతమైన బ్యాటింగ్ తీరుని కనబరిచి ఇండియన్ టీం కి ఎంతో కొంత స్కోర్ ని అయితే అందించాడు.ఇక అందులో భాగంగానే చాలామంది వీళ్ళిద్దరి పైన కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే బీసీసీఐ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే వీళ్ళిద్దరిని పక్కన పెట్టడానికి రీజన్ ఏంటంటే కొంతమంది కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. ఇక అందులో భాగం గానే వీళ్లిద్దరిని పక్కన పెట్టి కుర్ర ప్లేయర్ లను ఆడించ బోతున్నట్టుగా తెలుస్తుంది.
దీనివల్ల టెస్ట్ ప్లేయర్లు ఎవరు వన్డే ప్లేయర్లు ఎవరు అనేది తెలుసుకోవడానికి బీసీసీఐ కి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇక మీదట దాన్ని బట్టే ఏ ఫార్మాట్ లో బాగా ఆడగలిగే ప్లేయర్ల ను ఆ ఫార్మాట్ కోసం ఎంపిక చేయాలనే ఉద్దేశ్యం తో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతే తప్ప పుజార, రహానే బాగా ఆడటం లేదనే ఉద్దేశ్యం తో వాళ్ళని పక్కన పెట్టినట్టుగా కాదు అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి…