Border Gavaskar Trophy : తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం లభించింది. టెస్ట్ క్రికెట్లో అతనికి చోటు లభించడం ఇదే ప్రథమం. ఇటీవల బంగ్లాదేశ్ తో భారత్ t20 సిరీస్ ఆడింది. ఇందులో నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు. అద్భుతమైన ప్రదర్శన చేసి అలరించాడు. అతడు స్థిరంగా ఆడుతుండడంతో టెస్ట్ జట్టులోకి అవకాశాన్ని అందుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. భారత్ – ఏ జట్టుతో కలిసి అతడు కంగారు దేశంలో ఆడ ఎందుకు వెళ్లిపోయాడు. ఇక రంజి క్రికెట్లో స్థిరమైన ప్రదర్శన చేస్తున్న అభిమన్యు ఈశ్వరన్ కు కూడా జట్టులో చోటు లభించింది. యువ ఆటగాళ్లు ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా కు తొలిసారి టెస్ట్ జట్టులో అవకాశం లభించింది. న్యూజిలాండ్ జట్టుతో ప్రస్తుతం టెస్ట్ సీరీసాడుతున్న కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ కు ఆస్ట్రేలియా సిరీస్ లో అవకాశం లభించలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ మహమ్మద్ సిరాజ్ కు అవకాశం దక్కలేదు.. అంతేకాదు న్యూజిలాండ్ జట్టుపై సంచలన ప్రదర్శన చేస్తున్న వాషింగ్టన్ సుందర్ ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక అయ్యాడు. అయితే కులదీప్ యాదవ్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో అతడికి అవకాశం ఇవ్వలేదని బిసిసిఐ పేర్కొంది. ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్ లుగా ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నంబర్ 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 3 వరకు జరుగుతుంది. టీమిండియా – ఆస్ట్రేలియా ఐదు టెస్టులు ఆడుతుంది.
ఆస్ట్రేలియా వెళ్లే భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, బుమ్రా, అభిమన్యు ఈశ్వరన్, గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
సౌత్ ఆఫ్రికా టి20 సిరీస్ కు..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తో పాటు అంతకుముందు సౌత్ ఆఫ్రికాలో జరిగే టి20 సిరీస్ కు కూడా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీ20 జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ జట్టులో యువ ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కు జట్టులో స్థానం లభించింది. నవంబర్ 8 నుంచి 15 వరకు భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. కాగా, టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటినుంచి టీమిండియా వరుసగా మూడు టి20 సిరీస్ దక్కించుకుంది. జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయాలు సాధించి.. సిరీస్ లు సొంతం చేసుకుంది. దీంతో జట్టులో మరింత యువ రక్తాన్ని నింపడమే ఉద్దేశంగా బీసీసీఐ జట్టులో అనేక మార్పులు చేపట్టింది. దేశవాళీ, ఐపీఎల్ లో స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది.
సౌత్ ఆఫ్రికా కు వెళ్లే భారత ఆటగాళ్లు వీళ్లే
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రమణ్ దీప్ సింగ్, రవి బిష్ణో య్, అర్ష్ దీప్ సింగ్, ఆవేష్ ఖాన్ యష్ దయాళ్, విజయ్ కుమార్ వైశాఖ్.