Rohit Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్ డే, టీ 20 కెప్టెన్సీకి దూరమైన నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీకి ఇక ఢోకా లేదని అందరూ అనుకున్నారు. కానీ, కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రకటించేశారు కూడా. దాంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించారు.

ఈ క్రమంలోనే సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా సేవలందించే అవకాశం ఇచ్చిన బీసీసీఐతో పాటు తనను కెప్టెన్‌గా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోనీకి విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. జట్టు విజయం కోసం తాను 120 శాతం ప్రయత్నించానని, కెప్టెన్‌గా తనకు సహకరించిన ఆటగాళ్లు, కోచ్ రవిశాస్త్రికి థ్యాంక్స్ చెప్పాడు.
Also Read: అగ్రరాజ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాది కోసం దుండగుడి వీరంగం.. చివరకు ఏమైందంటే..?
ఇకపోతే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పైన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించారు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనే వార్త విని తాను షాక్‌కు గురైయినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విజయవంతంగా పని చేశాడంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ విరాట్ కోహ్లీకి అభినందనలు కూడా తెలిపాడు.
మొత్తంగా విరాట్ కోహ్లీ.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన నెల రోజుల్లోనే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడం గమనార్హం. అలా విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపైన అభిమానులు అయితే నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు విరాట్ అభిమానులు…బీసీసీఐ పెద్దల వల్లే కోహ్లీ ఈ డెసిషన్ తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీకి కావాలనే ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారని అంటున్నారు. గత కొంత కాలంగా బీసీసీఐకి, కోహ్లీకి మధ్య వివాదం నెలకొన్న సంగతి అందరికీ విదితమే.
ఇకపోతే విరాట్ కోహ్లీ రాజీనామాను బీసీసీఐ ఆమోదించింది. ఈ సందర్భంగా అతనికి ధన్యవాదాలు కూడా తెలిపింది. టెస్టుల్లో కెప్టెన్ గా విరాట్.. తన టీమ్ ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాడని కొనియాడింది. 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు అందించి మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడని తెలిపింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అతని వ్యక్తిగత నిర్ణయమని గంగూలీ పేర్కొన్నారు. ఆయన నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని చెప్పారు.
[…] Palnadu: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉంది. కానీ, రాజకీయ క్షేత్రంలో అప్పుడే రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఫైట్ వెరీ టఫ్ ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల మాచర్ల నియోజకవర్గంలో పట్టపగలు ఓ టీడీపీ నాయకుడి పీక కోసి చంపేశారు. ఈ క్రమంలోనే ఆ వెంటనే నర్సరావుపేటలో అదే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఏకంగా నియోజవర్గ ఇన్‌చార్జి పైనే పోలీసులు దాడులు చేశారు. దాంతో రాజకీయ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారాయి. […]