India Vs Pakistan World Cup: ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఆడుతూ శ్రీలంక పర్యటనలో బిజీగా ఉంది భారత జట్టు. కింద మీద పడి టీమిండియా ఎట్టకేలకు సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. తిరిగి ఈ సిరీస్ లో రెండవసారి పదవ తారీకున చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ కోసం కేవలం ఇండియా ,పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ మాక్స్ తర్వాత భారత్ జట్టు 12వ తారీఖున ఆతిథ్య శ్రీలంక జట్టుతో తలబడుతుంది. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ శ్రీలంక మధ్య 14వ తారీఖున మ్యాచ్ జరుగుతుంది. 15 న భారత్ ,బంగ్లా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ సూపర్ ఫోర్ మ్యాచ్ లు అన్నీ కూడా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచులు అన్ని డే/నైట్ మ్యాచ్‌లే.
ఈ సిరీస్ పూర్తి అయిన తర్వాత టీమిండియా జరగబోయే ప్రపంచ కప్ టోర్నమెంట్ కు సిద్ధమౌతుంది. ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా తన తొలి మ్యాచ్ను టీం ఇండియా ఎనిమిదవ తారీఖున ఆస్ట్రేలియా తో ఆడుతుంది. తిరిగి 11వ తేదీన జరిగే రెండవ మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్ ను ఢీ కొడుతుంది. ఇక ముచ్చటగా జరిగే మూడో మ్యాచ్ దాయాది పాకిస్తాన్ తో ఉంటుంది.
ఈ రోమాంచితమైన మ్యాచ్ కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే ఈ స్టేడియం చుట్టుపక్కల అన్ని హోటల్స్ బుకింగ్ పూర్తి అయిపోయింది. ఈ మ్యాచ్ ని లైవ్ గా చూడడానికి క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 15 16 తేదీల్లో సెమీఫైనల్స్ ఉండగా 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే వరల్డ్ కప్ 2023 మ్యాచ్లకు గాను టికెట్ల విక్రయం ప్రారంభించింది. మొదలైన వెంటనే హార్ట్ కేకుల్లా టికెట్లు అమ్ముడైపోతున్నాయి కూడా. అది చాలాకా బ్లాక్లో లక్షల రూపాయలు పెట్టి టికెట్లను కొనుగోలు చేస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. అన్ని మ్యాచ్లతో పోలిస్తే భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్లు విపరీతంగా అమ్ముడు అవుతున్నాయి. బ్లాక్ లో ఒక్క టికెట్ 50 లక్షల వరకు పలుకుతోంది అంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో చూడండి.
టికెట్లు దొరక్క ,అటు అంత డబ్బు పెట్టి బ్లాక్లో కొనలేక ,ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ తీపిక అభివృద్ధి వచ్చింది. మలిదశలో ఏకంగా నాలుగు లక్షల టికెట్లు విడుదల చేయబోతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్ తో చర్చలు జరిపిన తర్వాత బీసీసీఐ క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మలి విడుద టికెట్లను ఆన్లైన్ ,ఇతర మార్గాల ద్వారా విక్రయించనున్నట్లు తెలియపరచింది.
అన్ని మ్యాచ్లకు సంబంధించిన టికెట్ విక్రయాలు ఎనిమిదవ తారీకు రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలియపరచడంతో పాటు అధికారిక టికెటింగ్ వెబ్సైట్ని కూడా విడుదల చేసింది. మరింకెందుకు ఆలస్యం https://tickets.cricketworldcup.com వెబ్సైట్ను బాగా గుర్తు పెట్టుకొని , మీరు కూడా త్వరగా టికెట్లు బుక్ చేసుకోండి.