Ind Vs Nz 3rd Test: బెంగళూరు, పూణేలో పరాభవం.. ముంబైలోనైనా దక్కుతుందా విజయోత్సాహం? నేటి నుంచి కివీస్ తో మూడో టెస్ట్.. భారత జట్టులో మార్పులివే..

కోల్పోవడం అనేది లేకుండా గత 12 సంవత్సరాలుగా టీమిండియా స్వదేశంలో టెస్ట్ సిరీస్ లు సాధించుకుంటూ వస్తోంది. కానీ ఈసారి న్యూజిలాండ్ చేతిలో పరిస్థితి తారు మారైంది. మూడు టెస్టుల సిరీస్ 2-0 తేడాతో చేజారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 1, 2024 11:02 am

Ind Vs Nz 3rd Test

Follow us on

Ind Vs Nz 3rd Test: న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు టెస్టులలో ఓడిపోయిన నేపథ్యంలో.. శుక్రవారం నుంచి మొదలయ్యే మూడవ టెస్టులోనైనా గెలిచి.. పరువు కాపాడుకోవాలని భారత జట్టు భావిస్తోంది. సొంత గడ్డపై వైట్ వాష్ కు గురికాకుండా ఉండాలని కృత నిశ్చయంతో ఉంది. బెంగళూరు, పూణే మైదానాలలో న్యూజిలాండ్ విజయం సాధించింది. మూడో టెస్ట్ జరిగే ముంబైలోనూ గెలుపును దక్కించుకొని టీమిండియాను సున్నాకు పరిమితం చేయాలని కెవిఎస్ చెట్టు భావిస్తోంది.. బెంగళూరు, పూణే మైదానాలలో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం.. కొంతకాలం నుంచి స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో భారత బాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బ్యాటర్లు తడబడినప్పుడు అశ్విన్, జడేజా తమ స్పిన్ బౌలింగ్ తో ఆ లోటును పూడ్చేవారు. అయితే వారు న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు విమర్శలకు కారణమవుతోంది. స్పిన్ ను ఎదుర్కోవడంలో వీరిద్దరూ విఫలమవుతున్నారు. నాలుగు ఇన్నింగ్స్ లలో రోహిత్ 2, 52, 0, 8 పరుగులు మాత్రమే చేశాడంటే అతడి బ్యాటింగ్ స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు మూడుసార్లు అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా అతని వయసుపై నెట్టింట చర్చ ప్రారంభమైంది. రోహిత్ కెప్టెన్సీని సీనియర్ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ప్రత్యర్థి పై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచడంలో రోహిత్ విఫలమవుతున్నాడని సీనియర్ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు..

కోహ్లీ కూడా

కోహ్లీ కూడా పెద్దగా రానిచడం లేదు. న్యూజిలాండ్ పై ఒక హాఫ్ సెంచరీ మినహా.. మిగతా అన్ని ఇన్నింగ్స్ లలో పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో విరాట్ జట్టుకు భారంగా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. మిగతా ఆటగాళ్ల నుంచి అతడికి సహకారం లభించడం లేదు. పంత్ మెరుగ ఆడుతున్నప్పటికీ.. వాటిని భారీ స్కోర్ లుగా అతడు మలచలేకపోతున్నాడు. జడేజా, అశ్విన్ చెన్నై తరహా ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. బుమ్రా కూడా తన మార్కు అందుకోలేకపోతున్నాడు. కొత్తగా వచ్చిన వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ముంబై టెస్ట్ కు హర్షిత్ రాణా బరులకి దిగే అవకాశం కనిపిస్తోంది.

ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్

ఆస్ట్రేలియా, శ్రీలంక చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు.. భారత గడ్డపై మాత్రం సత్తా చూపిస్తోంది. తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సిరీస్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మూడవ టెస్ట్ కూడా గెలిచి వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. సీనియర్ ఆటగాడు కేన్ విలియంసన్ సిరీస్ కు దూరమయ్యాడు.. రచిన్ రవీంద్ర, లాతం, యంగ్, కాన్వే వంటి వారితో బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా కనిపిస్తోంది. సాంట్నర్ స్పిన్ బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడు. అయితే మూడో టెస్టులోనూ అతడి నుంచి ఆ స్థాయిలో ప్రదర్శనను న్యూజిలాండ్ జట్టు ఆశిస్తోంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో మూడవ టెస్టులో అటులో పెద్దగా మార్పులు ఏవీ ఉండవని న్యూజిలాండ్ మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పింది.

స్పిన్ వికెట్

బెంగళూరు మైదానాన్ని పేస్ బౌలింగ్, పూణే మైదానాన్ని స్పిన్ వికెట్ కు అనుకూలంగా రూపొందించిన బీసీసీఐ.. ముంబై మైదానాన్ని కూడా స్పిన్ వికెట్ కు అనుకూలంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై మైదానంలోని ఎర్రమట్టి పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుంది. అయితే ఈసారి కూడా అదే వికెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. మరోవైపు స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేశారు. ఏకంగా 35 బౌలర్లతో నెట్ సాధన చేశారు. అయితే వీరంతా కూడా స్పిన్ బౌలర్లు కావడం విశేషం. ముఖ్యంగా కోహ్లీ పూర్తిగా షాట్లు కొడుతూ కనిపించాడు. క్రీజ్ వైట్ లైన్లను ప్రత్యేకంగా పొడిగించారు. విభిన్న ప్రాంతాలలో బంతులు వేస్తూ బ్యాటర్లను పరీక్షించారు.. కాగా, భారత చివరిసారిగా 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో స్వదేశంలో వైట్ వాష్ కు గురైంది.