https://oktelugu.com/

IPL 2021: ఐపీఎల్ సెమీస్ పోరు ఉత్కంఠ.. నాలుగింటో ఒక జట్టుకే చాన్స్

IPL 2021: ఐపీఎల్ చివరి వారానికి చేరుకుంది. ఇప్పటికే ఢిల్లీ కాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సెమీస్ కు చేరాయి. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫైఅయ్యాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది. ఐపీఎల్ చివరి వారంలో అన్ని జట్లకు విషమ పరీక్షగా మారాయి. గెలిస్తేనే సెమీస్ చేరుతాయి. ఓడితే ఇంటిదారే. అందుకే శాయశక్తులా ఆడుతుండడంతో పోటీ తీవ్రమైంది. ఆట మజా వస్తోంది. ఉత్కంఠ రేపేలా జట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2021 4:02 pm
    Follow us on

    IPL 2021: ఐపీఎల్ చివరి వారానికి చేరుకుంది. ఇప్పటికే ఢిల్లీ కాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సెమీస్ కు చేరాయి. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫైఅయ్యాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది.

    ఐపీఎల్ చివరి వారంలో అన్ని జట్లకు విషమ పరీక్షగా మారాయి. గెలిస్తేనే సెమీస్ చేరుతాయి. ఓడితే ఇంటిదారే. అందుకే శాయశక్తులా ఆడుతుండడంతో పోటీ తీవ్రమైంది. ఆట మజా వస్తోంది. ఉత్కంఠ రేపేలా జట్లు పోరాడుతున్నాయి.

    ప్రస్తుతం నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ కోసం బరిలో నాలుగు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. అందులో రెండు జట్లకు కేవలం ఇతర జట్ల జయాపజయాలతో సంబంధం ఉండగా.. మరో రెండు జట్లు గెలిస్తే ముందుడుగు వేస్తాయి.

    ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు కప్ కొట్టిన ముంబై ఈసారి ఆపసోపాలు పడుతోంది. ముంబై ప్రధాన ఆటగాళ్లు అయిన రోహిత్, హార్ధిక్, కృనాల్, ఇషాన్, సూర్యకుమార్, పోలార్డ్ లు ఫాంలో లేక ఆ జట్టు వరుసగా ఓడి దూరంలో నిలిచింది. ఎప్పుడూ టాప్ లో ఉండే ముంబై ఈసారి మిగిలినఏకైక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఘన విజయం సాధిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరే చాన్స్ ఉంటుంది. లేదంటే ఇంటిదారి పట్టడం ఖాయం..

    ఇక కోల్ కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం 13 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ ముంబై కంటే బాగుంది. సో వీళ్లు చివరి మ్యాచ్ లో రాజస్థాన్ పై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందరికంటే ఎక్కువగా కోల్ కతానే ప్లే ఆఫ్స్ చాన్సులున్నాయి. 12 పాయింట్లతో సమంగా ఉన్న ముంబై , కోల్ కతాకు ప్లే ఆఫ్ అవకాశాలున్నాయి. వీటిలో నెట్ రన్ రేట్ బాగా ఉన్న కోల్ కతా మరింత మెరుగ్గా ఉంది.

    ఇక మిగిలిన రెండు బెర్త్ లు రాజస్థాన్ , పంజాబ్ లకు అవకాశాలున్నాయి. కానీ కేకేఆర్, ముంబై జట్లు వారి తదుపరి మ్యాచ్ లలో ఓడిపోతే ఈ రెండింటికి చాన్స్ ఉంది. సో ఎలా చూసినా ఈ నాలుగు జట్లలో కోల్ కతాకు ఫస్ట్ చాన్స్, ముంబైకి సెకండ్ చాన్స్ ఉంది. మిగిలిన పంజాబ్, రాజస్థాన్ అదృష్టంపై ఆధారపడి ఉన్నాయి.