CSK vs KKR IPL 2024: గత ఐపిఎల్ సీజన్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జరిగే ఐపీఎల్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రతి టీం యొక్క ప్లేయర్లు తమ చివరి శ్వాస వరకు పోరాటం చేసి ఎలాగైనా తమ టీమ్ కి విజయాన్ని అందించడమే లక్ష్యం గా ముందుకు కదులుతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న ప్లేయర్లు ఒకరిని మించి మరొకరు తమ టీం కోసం పూర్తి ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నారు. ఇక అందులో భాగంగానే కొన్ని టీమ్ లు విజయం సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే, మరికొన్ని టీములు మాత్రం ఒకటి, రెండు అపజయాలను మూటగట్టుకొని వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ టీం నాలుగు మ్యాచ్ లు ఆడగా నాలుగింటి లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ ల మధ్య ఒక పెద్ద ఫైట్ అయితే జరగబోతుంది. ఇక అందులో భాగంగానే గత రెండు మ్యాచ్ ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం ఇప్పుడు ఆ టీమ్ కి మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన కలకత్తా టీం మూడింటిలలో గెలిచి తమ సత్తా ఏంటో చూపించుకుంది. ఇక ఈ టీం కి కొత్తగా గౌతమ్ గంభీర్ మెంటర్ గా రావడంతో టీం స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా ప్లేయర్స్ కూడా తమ ప్లస్ లు, మైనస్ లు ఏంటో తెలుసుకుని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.
గత రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన చెన్నై ఈ మ్యాచ్ లో గెలవాలంటే మాత్రం కొన్ని విషయాల్లో కీలకమైన మార్పులు చేయాల్సిన అవసరమైతే ఉంది. అందులో ముఖ్యంగా ఈ మ్యాచ్ లో డారెల్ మిచెల్ ను పక్కనపెట్టి ఆయన ప్లస్ లో మొయిన్ అలీని తీసుకోవాలి… ఎందుకంటే మొయిన్ అలీ కి కలకత్తా టీం మీద మంచి రికార్డు ఉంది. ఇక అందులో భాగంగానే మొయిన్ అలీ ఆల్ రౌండర్ ప్లేయర్ కాబట్టి ఆయన టీమ్ కి చాలావరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తోడుగా మిచెల్ గత మ్యాచ్ ల్లో పెద్ద గా పరుగులు చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నదైతే లేదు. అజంకే రహనే, డారెల్ మిచెల్ ఇద్దరూ ఒకే విధంగా బ్యాటింగ్ చేస్తున్నారు. కాబట్టి టీంలో ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు. అందుకే రహనే ను టీమ్ లో కంటిన్యూ చేస్తూ, మిచెల్ ను పక్కన పెడితే బెటర్… ఇక నరైన్ ను కట్టడి చేయడంలో మొయిన్ అలీ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు అని చెప్పవచ్చు…ఇక పవర్ ప్లే లో కలకత్తా టీం ప్లేయర్స్ అయిన నరైన్, సాల్ట్ లను కట్టడి చేస్తే కలకత్తా టీమ్ భారీ స్కోర్ చేయకుండా ఉంటుంది. ఇక దానివల్ల బౌలర్ల మీద పెద్దగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉండదు.
కాబట్టి పవర్ ప్లే లో వీలైనంత తొందరగా కలకత్తా టీమ్ ఓపెనర్లను కట్టడి చేయగలిగితే చెన్నై ఈ మ్యాచ్ లో ఈజీగా గెలుస్తుంది. ఎలాగో ఈ మ్యాచ్ చెన్నై లోని ‘చిదంబరం’ స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్ కూడా చెన్నై కి వర్తించే అవకాశాలు ఉన్నాయి… ఇక ఇప్పటి వరకు చెన్నై కలకత్తా టీమ్ లు హెడ్ టు హెడ్ 29 సార్లు తలపడితే అందులో ఒక మ్యాచ్ డ్రా కాగా, కలకత్తా 10 మ్యాచ్ ల్లో, చెన్నై 18 మ్యాచ్ ల్లో విజయం సాధించింది…